Wanaparthi SP Office: వనపర్తి ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో నిర్మితమై రాజభవనాన్ని తలపిస్తోంది. 29 ఎకరాల విశాలమైన స్థలంలో.. మూడు అంతస్తుల్లో 60 గదులు నిర్మించారు.
తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది.
DGP Anjani Kumar: సైబర్ నేరాల నివారణకు, సైబర్ భద్రతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్నమైన పటిష్టమైన చర్యలు చేపట్టడం ద్వారా దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారని తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ అన్నారు.
చోరీకి గురైనా లేదా పోగొట్టుకున్న సెల్‌ఫోన్‌ల జాడను తెలుసుకునేందుకు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) అనే విధానాన్ని కొత్తగా ప్రవేశ పెడుతున్నట్టు డీజీపీ అంజనీ కుమార్ ప్రకటించారు.