సరిహద్దు, ఉత్తరాది రాష్ట్రాల నుండి తెలంగాణా రాష్ట్రానికి వచ్చే అక్రమ మధ్య రవాణాను అరికట్టేందుకై రాష్ట్ర పోలీసులు, ఎక్సయిజ్, రైల్వే, ట్రాన్స్పోర్ట్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అంజనీ కుమార్ తెలియచేసారు. తెలంగాణా రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలనుండి వచ్చే అక్రమ మద్యం రవాణా నిరోధం పై డీజీపీ అంజనీ కుమార్ నేడు సమీక్షా సమావేశం డీజీపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సయిజ్ శాఖ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అడిషనల్ డీజీ రైల్వేస్ శివధర్ రెడ్డి, సీఐడీ విభాగం ఏడీజీ మహేష్ భగవత్, శాంతి భద్రతల విభాగం ఏడీజీ సంజయ్ కుమార్ జైన్, ఐజి షా నవాజ్ కాసీం, ఇంటలిజెన్స్ డీఐజీ కార్తికేయ తదితరులు హాజరయ్యారు.
Also Read : IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అక్రమ మద్యం తయారీ, గుడుంబా లని నివారించామని, అయితే ఇతర రాష్ట్రాలనుండి అక్రమంగా వచ్చే మద్యం రవాణాను అడ్డుకోవాలని అన్నారు. ఇప్పటివరకు కొందరు ఇచ్చే సమాచారం ప్రాతిపదికపై అక్రమ మద్యం రవాణాదారులపై చర్యలు తీసుకుంటున్నామని, ఇదేకాకుండా వివిధ శాఖల మధ్య మరింత సమన్వయంతో అక్రమ రవాణాను పటిష్టంగా నివారించవచ్చని పేర్కొన్నారు. డీజీపీ చేసిన సూచనపై ఏకీభవిస్తూ, గవర్నమెంట్ రైల్వే పోలీస్ కూడా పూర్తి సహకారం అందిస్తుందని రైల్వేస్ అడిషనల్మ్ డీజీ శివధర్ రెడ్డి పేర్కొన్నారు. 2014 నుండి తెలంగాణా రాష్ట్రంలో అక్రమమద్యం నివారణకై 27 ,883 మందిపై కేసులు నమోదు చేసినట్టు సీఐడీ విభాగం అడిషనల్ డీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రవాణా చేసే 161 మందిపై కేసులు నమోదు చేశామని అన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రధానంగా ఢిల్లీ, చండీగఢ్,కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, హర్యానా, ఆంధ్ర ప్రదేశ్ లనుండి అక్రమంగా మన రాష్ట్రానికి రవాణా అవుతోందని తెలిపారు. తరచుగా అక్రమాలకూ పాల్పడే 15 మందిపై పీడీ చట్టాన్ని కూడా పెట్టామని పేర్కొన్నారు. అయితే, గతంతో పోల్చితే ప్రొహిబిషన్ ఎక్సయిజ్ కేసులు గణనీయంగా తగ్గాయని తెలియచేసారు.
Also Read : Rs.2000 Notes: విజయ్ ఆంటోని అన్నా.. నువ్వేమైనా జ్యోతిష్కుడివా..
ప్రొహిబిషన్ ఎక్సయిజ్ శాఖ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ, ధరల్లో వ్యత్యాసం ఉండడం వల్ల గోవా, హర్యానా, చండీగఢ్,లనుండి అధికంగా అక్రమ మద్యం వస్తోందని పేర్కొన్నారు. ఇది ఒక వ్యవస్తీకృతమైన నేరంగా మారిందని అన్నారు. దీనివల్ల రాష్ట్ర ఆదాయంపై గణనీయమైన ప్రభావం చూపుతోందని చెప్పారు. కర్ణాటక, గోవా రాష్ట్రాలనుండి వచ్చే పర్యాటకులు అక్రమంగా మద్యాన్ని తెస్తున్నారని, అంతర్ రాష్ట్ర బస్సులు, టూరిస్ట్ వాహనాల ద్వారా వస్తోందని తెలిపారు. దీనితోపాటు, నాగ్ పూర్- బల్లార్షా, నిజామాబాద్ రైల్వే మార్గాల్లో కూడా అహికంగా వస్తోందని వివరించారు. పోలీస్, ట్రాన్స్పోర్ట్, రైల్వే పోలీస్, రాష్ట్ర పోలీసులు ఈ అక్రమ మద్యం రవాణా నివారణలో కల్సి పనిచేయాలని కోరారు. సరిహద్దు రాష్ట్రాలతోపాటు, పంజాబ్, చండీగఢ్, గోవా, ఢిల్లీ తదితర రాష్ట్రాలనుండి అక్రమ మద్యం రవాణా చేసే వారిని గుర్తించి, వారి జాబితా సిద్ధం చేశామని ఇంటలిజెన్స్ డీఐజీ కార్తికేయ వెల్లడించారు. ఈ సమావేశంలో ఎక్సయిజ్ శాఖ జాయింట్ కమీషనర్ సయ్యద్ ఖురేషి,ఆర్పీఎఫ్ కమాండెంట్ దెబోస్మితా బెనర్జీ, రైల్వేస్ ఎస్.పి షేక్ సలీమా, ఎస్.పి లు విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, స్నిగ్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.