DGP Anjani Kumar : శాంతి, భద్రతల పరిరక్షణకు మరింత అప్రమత్తంగా ఉండాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్నికల సమీపిస్తున్నందున శాంతి, భద్రతల పరిరక్షణకై మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు డీజీపీ అంజనీ కుమార్. నగరంలో ఏర్పాటు చేసిన అతిపెద్ద చారిత్రక 125 అడుగుల డా. బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనేందుకై వచ్చిన సీపీలు, ఎస్పీలతో డీజీపీ కార్యాలయంలో నేడు సమావేశం నిర్వహించారు. అడిషల్ డీజీ లు మహేష్ భగవత్, సంజయ్ కుమార్ జైన్, విజయ్ కుమార్, షికా గోయల్, సందీప్ శాండిల్య, రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్, ఐజీలు కమలహాసన్ రెడ్డి, చంద్ర శేఖర్ రెడ్డి, షా నవాజ్ కాసీం, డీఐజీ రమేష్ రెడ్డి తదితర సీనియర్ పోలీస్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Also Read : Ukraine War: వీకిపీడియాకు మాస్కో కోర్టు షాక్.. ఉక్రెయిన్ యుద్ధంపై కథనం రాసినందుకు జరిమానా
Also Read
ఈ సందర్బంగా డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాలు, సంస్థలు పాదయాత్రలు, బహిరంగ సభలు అధికంగా నిర్వహిస్తాయని, ఈ సందర్బంగా శాంతి భద్రతల విభాగం, స్పెషల్ బ్రాంచ్ ల పనితీరు అత్యంత కీలకమని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతీ బందోబస్తు ప్రతీ సారి ఒక పరీక్షగా ఉంటుందని, ప్రతీసారి ఎదురయ్యే కొత్త సవాళ్లకు అనుగుణంగా సరికొత్త వ్యూహంతో పనిచేయాలని అన్నారు. రాష్ట్రానికి ఉన్న సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్ లకు చెందిన సరిహద్దు జిల్లాలపట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీవ్రవాద పార్టీల సానుభూతిపరులు, మాజీలు, మిలిటెంట్లపై ప్రత్యేక దృష్టిసాధించాలని చెప్పారు. సామాన్య ప్రజలు, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారితో పోలీస్ శాఖ సిబ్బంది, అధికారుల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏ ప్రాంతంలోనైనా పోలీస్ అధికారులు అమర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తే అది మొత్తం పోలీస్ శాఖకే మచ్చ గా ఉంటుందని హెచ్చరించారు. పోలీస్ అధికారుల గ్రామాల సందర్శన కార్యక్రమానికి ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తోందని, ఈ విధానాన్ని మరింత పటిష్ష్టంగా కొన సాగించాలని ఆదేశించారు.
Also Read : Pan India: ఇక ఇప్పుడు అందరి చూపు ‘విరూపాక్ష’ మీదే!
ప్రపంచంతోపాటు మన రాష్ట్రం లోనూ సైబర్ నేరాల పెరుగుదల ఉందని, ఈ సైబర్ నేరాల పట్ల ప్రజలను చైతన్య పర్చడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని అంజనీ కుమార్ పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ అనేది కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాలేదని ఇది గ్రామాలకూ వ్యాపించిందని అన్నారు. ఈ సైబర్ నేరాల నివారణకు కేవలం ప్రజల చైతన్యమే మార్గమని తెలిపారు. ఇందుకు గాను, రాష్ట్రం లోని ప్రతీ పోలీస్ స్టేషన్లో కనీసం పది మంది పోలీస్ అధికారులకు సైబర్ క్రైమ్ నివారణలో ప్రత్యేక శిక్షణ నివ్వాలని ఆదేశించారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా విస్తృతి గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో పోలీస్ విభాగాల్లోని సోషల్ మీడియా ను మరింత పటిష్టపర్చుకోవాలని డీజీపీ తెలియచేసారు.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల వల్లమరణాలు అధికంగా ఉన్నాయని, సంబంధిత రోడ్లు, భవనాల శాఖ అధికారులతో కలసి రోడ్డున ప్రమాదాలు జరిగే హాట్ స్పాట్లను గుర్తించి, రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ఇంజనీరింగ్ చేపట్టాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రస్తుత రంజాన్ పండగ నేపథ్యంలో గోవుల అక్రమ రవాణా జారకుండా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లతో పాటు అన్ని జిల్లాల పోలీస్ అధికారులు ప్రత్యేక నిఘా వహించాలని ఆదేశించారు.
డా. బీ.ఆర్ అంబేద్కర్ స్పూర్తితో నవ సమాజ నిర్మాణానికి రాష్ట్రంలోని అందరు పోలీస్ అధికారులు పునరంకితం కావాలని డీజీపీ అంజనీ కుమార్ అన్నారు. డీజీపీ కార్యాలయంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా నిర్వహించారు.. అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలర్పించి ఘనంగా నివాళులర్పించిన డీజీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ, దేశంలో మరెక్కడా లేనంతగా చారిత్రక అతిపెద్ద 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టమని తెలిపారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
BJP-GenZ: బీజేపీ వైపు జెన్-జీ? ఢిల్లీ వర్సిటీ ఎన్నికల సందేశం ఇదేనా!
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్‌లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!