Telangana: రాష్ట్రంలో పనిచేస్తున్న పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతుల ఫైలుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోద ముద్ర వేయడంతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ లకు డీజీ హోదాను కల్పించారు. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి పదోన్నతులు, సౌమ్య మిశ్ర, అభిలాష బిష్ట, శిఖా గోయల్‌లకు పదోన్నతులు కల్పించినట్లు వెల్లడించారు. Read…