కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ స్వామివారు, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ షష్టి మహోత్సవాలను ప్రారంభించారు.
Koti Deepotsavam Day-7: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది.. కాగా.. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున…
Brahmotsavalu in Tirumala: ఏడాదికి 365 రోజులు మాత్రమే. కానీ.. ఏడుకొండలవాడికి అంతకన్నా ఎక్కువే ఉత్సవాలు జరుగుతుంటాయి. సంవత్సరం పొడవునా సప్తగిరుల పైన నిర్వహించే సంబరాలన్నింటిలోకీ బ్రహ్మోత్సవమే సర్వోన్నతమైంది. సకల సందేశాలతో కూడింది. కలియుగ దైవం కోవెల నుంచి ఉత్సవమూర్తి రూపంలో భక్తకోటిలోకి వచ్చి వాళ్ల హృదయాల ఊయలలో, మారుమోగే గోవింద నామస్మరణాల నడుమ ఊరేగుతాడు. తనను కొలిచే గుండెల్లో, పిలిచే గొంతుల్లో అంతర్లీనంగా గొప్ప ఆధ్యాత్మిక భావనను నింపుతాడు.