అత్యధిక వేతనం తీసుకుంటున్నారంటూ వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. కౌంటర్ ఇచ్చారు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆయన.. తన సొంతూరులో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. తనకు ప్రతీ నెలా రూ.5 లక్షల గౌరవవేతనం వస్తే.. అందులో రూ.2.75 లక్షలు ట్యాక్సులకే పోతుందన్నారు.. నెలలో తాను ఆదా చేసుకున్న దాని కన్నా ఎక్కువే కొందరు సంపాదిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇక, ప్రజలంతా కర్తవ్యదీక్షతో పన్నులు చెల్లించాలన్నారు. రాష్ట్రపతి కోవింద్ తాను ట్యాక్స్ కడుతున్నట్లు చెప్పగానే అక్కడ ఉన్న ప్రజలంతా చప్పట్లు కొట్టారు. తాను ఆదా చేసిన దాని కన్నా.. అధికారులు ఎక్కువ సంపాదిస్తారని, ఇక్కడ ఉన్న టీచర్లు తనకంటే ఎక్కువ సేవ్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు రాష్ట్రపతి రామ్‌నాథ్.