బీహార్‌లోని గయాలో పెను రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం రఘునాథ్‌పూర్ గ్రామ సమీపంలోని వజీర్‌గంజ్ స్టేషన్, గయా-కోడెర్మా రైల్వే సెక్షన్‌లోని కొల్హానా హాల్ట్ మధ్య జరిగింది. ఇంజిన్‌ను లూప్‌లైన్ నుంచి గయా వైపు తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా ఇంజన్ అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
రైలు సామాన్యుడి నేల విమానం. టికెట్ల ధరలు తక్కువగా ఉండటంతో సామాన్యులు ఎక్కువ మంది రైల్వే ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ఈ రైల్వే ప్రయాణాన్ని చాలా మంది సురక్షితమని భావిస్తారు
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లా కుమేద్‌పూర్ వద్ద గూడ్స్ రైలు ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. ఈ విషయాన్ని రైల్వే అధికార ప్రతినిధి ధృవీకరించారు.
బీహార్‌లోని బగాహా జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. ఆర్మీ సైనికులతో వెళ్తున్న ప్రత్యేక రైలు ప్రమాదానికి గురైంది. బగాహ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. రాజస్థాన్‌లోని ఆర్మీ బెటాలియన్‌ను బెంగాల్‌కు వెళ్తున్నట్లు సమాచారం. రైలులో సైనిక సిబ్బందితో పాటు వారి వాహనాలు కూడా ఉన్నాయి. ఈ రైలులోని మూడు బోగీలు బగాహా వద్ద రైల్వే ట్రాక్ నుండి పట్టాలు తప్పాయి. దీంతో.. గోరఖ్‌పూర్-నర్కటియాగంజ్ మధ్య రైల్వే రాకపోకలకు అంతరాయం కలిగింది.
ఏపీలో పెను ప్రమాదం తప్పింది. ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలస రైల్వే స్టేషన్ లో విశాఖపట్నం టు భవానీపట్నం వెళ్తున్న ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. అయితే ఈ ప్రమాదంలో.. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. లోకో పైలట్ ఎం.హెచ్.ఆర్ కృష్ణ అప్రమతం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్యాసింజర్ రైలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సాయంత్రం 6 గంటలకు బయలుదేరగా.. గంట వ్యవధిలోనే కొత్తవలస…
చెన్నైలోని ఆవడి వద్ద లోకల్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈరోజు ఉదయం అన్ననూర్ వర్క్‌షాప్ నుండి ఆవడికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 4 కోచ్‌లు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది. మెరీనా బీచ్‌కు వెళ్లే ఈ రైలులో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పన్వెల్-వసాయి మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదని ప్రాథమిక సమాచారం.