AP Cabinet Decisions: నెలాఖరు నుంచి శ్వేత పత్రాల విడుదల.. వాటిపైనే దృష్టి..
- కీలక నిర్ణయాలు తీసుకున్న తొలి కేబినెట్ సమావేశం
- మూడున్నర గంటలపాటు సాగిన కేబినెట్
- ఈ నెలాఖరు నుంచి వరుసగా ఏడు శ్వేత పత్రాలను విడుదల
- పోలవరం.. అమరావతి.. విద్యుత్.. పర్యావరణం.. శాంతి భద్రతలు.. మద్యం.. శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై శ్వేత పత్రాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Decisions: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడున్నర గంటలపాటు సాగిన సమావేశంలో.. జరిగిన సుదీర్ఘ చర్చ, తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు వివరాలు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.. ప్రజలరు భరోసా కల్పించే ప్రభుత్వం వచ్చింది.. మెగా డీఎస్సీ నిర్వహణపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం.. ఉపాధ్యాయుల నియామకాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కానీ, మేం టీచర్ల నియామకానికి హై ప్రయార్టీ ఇచ్చాం.. 16,347 పోస్టులతో భర్తీ చేశాం. ఆరు నెలకొకసారి నిర్వహించే టెట్ పరీక్షలను గత ప్రభుత్వం నిర్వహించ లేదు. దీని వల్ల నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది. నాణ్యత కలిగిన విద్యని అందించేలా ఎన్ఈపీని స్టడీ చేయమన్నారని తెలిపారు.
Read Also: Farmer Hulchul: కలెక్టరేట్ పైకెక్కి పురుగుల మందు తాగి రైతు హల్‌చల్
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దుపై కేబినెట్ నిర్ణయం తీసుకుంది అని తెలిపారు పార్థసారథి.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ పేరు చెబితేనే భూ యజమానులు తమపై పిడుగుపాటు పడ్డట్టు ఫీలయ్యారు. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి.. గత ప్రభుత్వం తెచ్చిన చట్టానికి తీవ్ర వైరుధ్యాలున్నాయి. అలాంటి భయంకరమైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాం అన్నారు. పెన్షన్లు పంపిణీపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం. 65.30 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారు. సచివాలయ సిబ్బందే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేపడతారు.. బకాయిలతో సహా రూ.7 వేల పెన్షన్ ఇస్తామన్నారు.. ఈ పెన్షన్ పెంపు వల్ల నెలకు రూ. 810 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది.. ఏడాదికి రూ. 33,709 కోట్లు పెన్షన్ల నిమిత్తం పంపిణీ చేయబోతున్నాం అని పేర్కొన్నారు పార్థసారథి.
Read Also: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వారికి 6 నెలల సెలవులు
తమ ప్రభుత్వంలో స్కిల్ సెన్సస్ చేపడతాం అన్నారు మంత్రి పార్థసారథి.. అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నాం. పౌష్టికాహారాన్ని పేదలకు రూ. 5కే అందిస్తున్నాం. మొత్తంగా 203 అన్న క్యాంటీన్లను గత ప్రభుత్వం మూసేసింది. వీటిల్లో 183 క్యాంటీన్లను త్వరలో ప్రారంభించబోతున్నాం.. మిగిలిన 20 క్యాంటీన్లను తర్వాత ప్రారంభిస్తాం అని వెల్లడించారు. ఇక, హెల్త్ యూనివర్శిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెడుతూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దమ్మాలపాటి శ్రీనివాసును ఏజీగా కేబినెట్ ఆమోదం తెలిపింది.. గంజాయి నివారణకు ఐదుగురు సభ్యులతో కేబినెట్ సబ్ కమిటీ వేసింది. పంచాయతీ, మున్సిపాల్టీల్లో పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించిందన్నారు.. మరోవైపు.. ఈ నెలాఖరు నుంచి వరుసగా ఏడు శ్వేత పత్రాలను విడుదల చేయబోతున్నాం. పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం, శాంతి భద్రతలు, మద్యం, శాండ్ అండ్ మైన్ వంటి వాటిపై ఈ శ్వేత పత్రాలు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు మంత్రి కొలుసు పార్థసారథి.
తాజావార్తలు
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
-
Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?