పార్వతీపురం మన్యం జిల్లా పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.. ఓజీ.. ఓజీ.. అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు.. వెంటనే వారికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన ఆయన.. ఓజీ.. ఓజీ.. అని అరవకండి.. నన్ను పని చేసుకోనివ్వండి అని సూచించారు.. నేను డిప్యూటీ సీఎంను అయినా.. ఇంకా సీఎం సీఎం అని అరుస్తున్నారు.. ఇది సరైంది కాదని హితవు చెప్పారు.. ఇక, తిరుబాటును, భాషను నేర్పించిన…
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రాష్ట్రంలో పర్యటించనున్నారు. విజయవాడలోని పెనమలూరులో సీఎం చంద్రబాబు పర్యటించనుండగా.. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. సీఎం పెనమలూరులో ధాన్యం కొనుగోలు సెంటర్ పరిశీలించి.. రైతులతో ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం రెవెన్యూ సదస్సులో పాల్గొని అధికారులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గన్నవరం నుంచి ఉదయం 9.30 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. విశాఖ…
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటనకు సిద్ధం అయ్యారు.. రేపు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటించబోతున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న పవన్ కల్యాణ్.. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో సాలూరు చేరుకుంటారు..
ఈ రోజు సీఎం చంద్రబాబుతో సమావేశం అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అరంగట పాటు జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా నాగబాబుకు మంత్రి పదవి, నామినేటెడ్ పదవుల భర్తీపై చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.. కాగా, నాగబాబుకి ఏపీ కేబినెట్లో చోటు దక్కనుంది అని ప్రకటించిన తర్వాత ఆయనకు ఏ శాఖను కేటాయిస్తారని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా చర్చ సాగుతోంది..
వికసిత భారత్‌లో భాగమే స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. విజయవాలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.. సైబరాబాద్ ఛీఫ్ ఆర్కిటెక్ట్ చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు.. సీఎం చంద్రబాబు ఓపికని చాలా మెచ్చుకోవాలి.. సీఎం చంద్రబాబు నుంచి నేర్చుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
ఇసుక విషయంలో ఎవరైనా చెయ్యి పెడితే కఠిన చర్యలుంటాయని మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇసుక విధానాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని చూస్తు్న్నారు.. కానీ, అలా కాకుండా.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా దానిలో కలిపించుకుంటే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.. మన ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది.. మంచి చేసేవారికి సపోర్ట్ ఉంటుంది.. ప్రజలకు మంచి చేయడానికే మన ప్రభుత్వం ఉందన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. 2014లో విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు ఉండవల్లి.. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినవి రాబట్టుకోవడానికి పవన్ కల్యాణ్ శ్రద్ధ తీసుకోవాలని లేఖలో కోరారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు.. అయితే, ఉన్నట్టుండి ఆయన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. ఇప్పటికే పీడీఎస్ బియ్యంపై ఏపీ సర్కారు సీరియస్‌గా ఉన్న సమయంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ బియ్యం విషయంలో ప్రభుత్వం సీరియస్ అవడంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.