ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. శుక్రవారం రోజు పిఠాపురంలో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన మినీ గోకులాన్ని ప్రారంభించనున్నారు పవన్ కల్యాణ్..
తిరుపతి తొక్కిసలాట ఘటనపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై ఆయన క్షమాపణ కోరారు. తప్పు జరిగింది.. క్షమించాలని విన్నవించారు.
నిన్న రాత్రి బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో, కొద్దిసేపటి కిందట ఆ ప్రాంతాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రమాదం జరిగిన తీరును, కారణాలను జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, డీఎస్పీ చెంచుబాబు, చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలను అడిగి తెలుసుకున్నారు పవన్ కల్యాణ్..
శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద తొక్కిసలాట ఘటన జరిగిన విషయం తెలిసిందే. తిరుపతి నగరంలోని వివిధ ప్రాంతాల్లో టోకెన్ల జారీ కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా భక్తులు.. టోకెన్ల కోసం తరలి రావడంతో తొక్కిసలాట జరిగి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కాగా.. తాజాగా ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.
భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు విశాఖపట్నం సిద్ధం అవుతోంది.. ఇక, ప్రధాని మోడీ కంటే ముందుగానే విశాఖ చేరుకోనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రధాని మోడీకి స్వాగతం పలికి.. ఆ తర్వాత రోడ్‌షోలో పాల్గొనబోతున్నారు..
పవన్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి వెళ్లినా.. ఓజీ.. ఓజీ అంటూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.. అయితే, వాళ్లకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ వస్తున్నారు పవన్.. తనను పని చేసుకోనివ్వండి అని గట్టిగానే సమాధానం ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు విజయవాడలో 35వ పుస్తక మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మరోసారి అదే అనుభవం ఎదురైంది.. పవన్ స్పీచ్ సమయంలో OG.. OG.. అంటూ నినాదాలు చేశారు అభిమానులు.. అయితే..…
నేటి నుంచి విజయవాడలో పుస్తక మహోత్సవం ఆరంభం కాబోతోంది. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్) ఆధ్వర్యంలో జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు 11 రోజుల పాటు పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. విజయవాడ బుక్ ఎక్జిబిషన్‌కు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం సర్వం సిద్ధమైంది. 35వ పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించనున్నారు. గురువారం సాయంత్రం 6 గంటలకు పుస్తక మహోత్సవాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభిస్తారు. మంత్రి పయ్యావుల కేశవ్, సాహిత్య అకాడమీ…
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని మంగళగిరి క్యాంపు కార్యాలయంలో కలిశారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దిల్ రాజు పుష్పగుచ్చం అందజేశారు. అయితే జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరవహించనున్నారని ముందు నుంచి ఈ మేరకు ప్రచారం జరిగింది. ఉదయం మీటింగ్ లో ఈ ఈవెంట్ పర్మిషన్స్ అలాగే ఏర్పాట్ల విషయమై పవన్ తో దిల్…
కాకినాడ తీర ప్రాంతంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమలో తనిఖీలు చేపట్టండని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు ఇచ్చారు. కాకినాడలోని యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రై.లి. వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం విచారణ వేగవంతం చేసింది. సింహాద్రిపురం మండలం దిద్దేకుంట గ్రామంలో నాగేంద్ర అనే రైతు అప్పుల బాధ తాళలేక తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణ చేపట్టాలని కలెక్టర్, ఎస్పీని ఆదేశించారు.