ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాలో పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టారు.. ఆశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. గ్రామాల్లో పరిశుభ్రత అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. అయితే, డంపింగ్ యార్డ్ సమస్య ప్రధానంగా మారిందన్నారు.. దీని కోసం మండలం యూనిట్‌గా డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం అని వివరించారు.. ఇక, 2019-24 మధ్య పంచాయతీ భవనాలకు రంగులు వేయడానికి రూ.104.81 కోట్లు ఖర్చు చేశారని దుయ్యబట్టారు పవన్ కల్యాణ్..
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి సిద్ధం అయ్యారు.. నేటి నుంచి రెండు రోజుల పాటు మహారాష్ట్రలో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొననున్నారు పవన్.. మొత్తంగా మహారాష్ట్రలో రెండు రోడ్ షోలు, ఐదు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు ఏపీ డిప్యుటీ సీఎం.. తొలి రోజు పర్యటనలో భాగంగా ఈ రోజు మరట్వాడా, విదర్భ, పశ్చిమ మహారాష్ట్రలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు పవన్ కల్యాణ్..
ప్రపంచ శాంతికి శ్రీశ్రీ రవిశంకర్ గొప్ప మార్గం చూపారు అంటూ ప్రశంసలు కురిపించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్.. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రపంచ శాంతికి, భారతదేశ ఆధ్యాత్మిక విశిష్టత ప్రాచుర్యానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గొప్ప మార్గం చూపించారని, ఆ మార్గంలో మనస్ఫూర్తిగా ముందుకెళ్తామన్నారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు.. జనసేన కండువా కప్పుకున్నారు.. విజయవాడ సిటీ నుంచి పలువురు కార్పొరేటర్లు , జగ్గయ్య పేట, ధర్మవరం, అనంతపురం ప్రాంతాల నుండి వైసీపీకి గుడ్‌బై చెప్పి వచ్చిన నేతలు.. జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో బాధ్యతగా ప్రవర్తించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. పోలీసులు బాధ్యతగా పని చేయకపోతే వారు చేసిన తప్పులు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. ఇటీవల కాకినాడ జిల్లా తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఈ వ్యవహారంలో పోలీసులు ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్‌పై స్పందించారు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. "రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారింది.. మన ఎన్డీఏ ప్రభుత్వం మునుపటి అవినీతి, నేర పాలన నుండి సంక్రమించిన మరొక వారసత్వ సమస్య, రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.. కొంతకాలం క్రితం, విశాఖపట్నం పోర్టులో కొకైన్ షిప్‌మెంట్‌ను స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్‌కు విజయవాడలోని ఒక…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు - పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
జనసేన పార్టీ కార్యాలయంలో సర్పంచ్ సంఘాలతో సమావేశం అయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు.. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై స్పందించిన పవన్.. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచలతోనే కూటమి ప్రభుత్వం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాతో సమావేశమయ్యారు.