ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు లోకేష్.. బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్కి శుభాకాంక్షలు తెలిపుతున్నారు..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ రోజు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.. గ్రామ పంచాయతీ క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు.. ఆదాయ ప్రాతిపదికతతోపాటు జనాభా ప్రాతిపదికనను జోడించి కొత్త గ్రేడ్లు ఇవ్వనున్నారు.. గ్రేడ్లు ఆధారంగా సిబ్బంది కేటాయింపు ఉంటుందని.. గ్రామ పంచాయతీ, సచివాలయ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని.. అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం పవన్…
పిఠాపురంలో క్రైమ్ పెరిగిందంటూ గత వారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆస్తికర వ్యాఖ్యలు చేశారు.. ప్రూఫ్స్ లేకుండా నేను మాట్లాడను అని స్పష్టం చేశారు.. అటువంటిది ఉంటే అడ్రస్ చేస్తామని వెల్లడించారు..
కేంద్ర హోంమంత్రి అమిత్షా సీఎం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎంపీ పురందేశ్వరీ అమిత్కు స్వాగతం పలికారు. సుమారు గంటకు పైగా సీఎం చంద్రబాబు నివాసంలో అమిత్ షా ఉండనున్నారు. పలు కీక అంశాలపై వీరి మధ్య చర్చ జరగనుంది.
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంపై గుర్తు తెలియని డ్రోన్ ఎగిరింది. ఈ రోజు మధ్యాహ్నం 1గం.30 నిమిషాలు నుంచి 1గం.50 నిమిషాల మధ్య డ్రోన్ ఎగిరింది. నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం భవనంపై డ్రోన్ ఎగరడం కలకలం సృష్టించింది.
ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.. వారి ఆధ్వర్యంలో అభివృద్ధికి అవకాశం ఉందన్నారు టీజీ వెంకటేష్..
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని భారతీయులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పండగ సందడిలో తెలుగు రాష్ట్రాల పల్లెలు శోభాయమానంగా మారాయని పేర్కొన్న ఆయన.. భారతీయులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.. పల్లె సౌభాగ్యమే... దేశ సౌభాగ్యం అని తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు.
కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద ఏర్పాటైన ప్రపంచంలోనే అతి పెద్దదైన పిన్నాపురం గ్రీన్కో సోలార్ పవర్ ప్రాజెక్టు పవర్ హౌస్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ఇక్కడ ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయి.
ఈ రోజు ఉదయమే పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఉదయం 2 గంటల పాటు పవన్ కల్యాణ్ కోసం స్టాళ్లను తెరిచి ఉంచాలని ఆయన నిర్వాహకులను విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేవలం పవన్ కల్యాణ్ కోసం కొన్ని స్టాళ్లు ఆయన అడిగినవి తెరిచి ఉంచారు.. పవన్ కల్యాణ్ ఆయా స్టాళ్లను సందర్శిస్తూ.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథం కూడా…