Deputy CM Pawan Kalyan: చివరి నిమిషంలో పవన్ పర్యటన వాయిదా.. నెక్ట్స్ ఏంటి..?
- ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా..
- 5 రోజుల పాటు దక్షిణ భారత దేశం పర్యటనకు సిద్ధమైన పవన్..
- ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం..
- చివరి నిమిషంలో పర్యటన వాయిదా వేసుకున్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చివరి నిమిషంలో తన పర్యటన వాయిదా వేసుకున్నారు.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆయన.. మరో కీలక నిర్ణయం తీసుకుంటూ.. ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకున్నారు.. అయితే, దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శనను వాయిదా వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కోసం ఆలయాల సందర్శనకు వెళ్లాలని నిర్ణయించుకున్న పవన్ కల్యాణ్.. తొలి విడతలో ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలని అనుకున్నారు.. తొలుత అనంతపద్మనాభ స్వామి ఆలయానికి వెళ్లాలనుకున్న ఆయన.. చివరి నిమిషంలో పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే, పవన్ కల్యాణ్ పర్యటన వాయిదా శాశ్వతమా? లేక తాత్కాలికమా? అనే సమాచారం తెలియాల్సి ఉంది.. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆలయాల సందర్శన వార్తను ముందే బ్రేక్ చేసింది ఎన్టీవీ.. దీంతో, నిన్నటి నుంచి ఈ యాత్ర మీదే చర్చ సాగుతోంది.. అయితే, పవన్ కల్యాణ్ తాజా నిర్ణయంతో నెక్ట్స్ ఏం చేయబోతున్నారనే దానిపై పార్టీ శ్రేణులతో పాటు.. పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!