Deputy CM Pawan Kalyan: హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్‌పై దాడి ఘటన కలకలం రేపింది.. రంగరాజన్ ఇంట్లో ఉన్న సమయంలో ఆయనపై కొందరు దాడి చేశారు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.. నాపై 20 మంది దాడి చేశారు.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం.. పూర్తి వివరాలు విచారణలో తెలుస్తాయని పేర్కొన్నారు రంగరాజన్.. అయితే, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఘటనపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ దాడి దురదృష్టకరమన్న ఆయన.. ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Read Also: PM Modi: ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే చదువుకోవాలి.. పరీక్షా పే చర్చలో విద్యార్థులకు మోడీ చిట్కాలు
ఈ దాడిని ఒక వ్యక్తిపై చేసినట్లుగా కాకుండా.. ధర్మ పరిరక్షణపై చోటు చేసుకున్న దాడిగా భావించాలన్నారు పవన్ కల్యాణ్.. కొన్ని దశాబ్దాలుగా రంగరాజన్.. ధర్మ పరిరక్షణకు, ఆలయాల వారసత్వ సంప్రదాయాలు, పవిత్రతను కాపాడేందుకు తపిస్తున్నారు.. పోరాటం చేస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థ సభ్యులమని చెప్పి వెళ్లిన ఒక మూక.. రంగరాజన్ పై దాడి చేయడం వెనక ఉన్న కారణాలు ఏమిటో పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆ మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలి. ఈ దాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం పలు విలువైన సూచనలను రంగరాజన్ నాకు అందించారు. టెంపుల్ మూమెంట్ అనే కార్యక్రమం ఏ దశలో ప్రారంభించాల్సి వచ్చిందో తెలియచేశారు. హిందూ ఆలయాల నిర్వహణ, ధర్మ పరిరక్షణపై ఆయన ఎంతో తపన పడుతున్నారు. ఆయనపై చోటు చేసుకున్న దాడిని ప్రతి ఒక్కరం ఖండించాలి. చిలుకూరు వెళ్లి శరంగరాజన్ ని పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇవ్వాలని జనసేన పార్టీ తెలంగాణ విభాగానికి దిశానిర్దేశం చేసినట్టు ఓ ప్రకటనలో వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..