పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన ప్రారంభమైంది.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన పవన్ కల్యాణ్.. కొచ్చి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు పుణ్య క్షేత్రాలు దర్శించుకునే యాత్రకి ఈ రోజు శ్రీకారం చుట్టిన ఆయన.. ఇందులో భాగంగా కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. కొచ్చి సమీపంలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని ఈ పర్యటనలో మొదట దర్శించుకోనున్నారు పవన్ కల్యాణ్..
చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఘటనపై స్పందించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ దాడి దురదృష్టకరమన్న ఆయన.. ఒక వ్యక్తిపై కాదు.. ధర్మ పరిరక్షణపై దాడిగా భావించాలన్నారు.. చిలుకూరులోని ప్రసిద్ధ బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ పై ఒక మూక దాడి చేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. దురదృష్టకరమైన ఘటన ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఢిల్లీలో బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విశ్వాసం మరోమారు రుజువైందన్నారు.. 2047 నాటికి మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేలా నరేంద్ర మోడీ చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని విస్మరించని అభివృద్ధి కార్యక్రమాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు ఇస్తున్నారు. నరేంద్ర మోడీ నిర్దేశించిన లక్ష్యాన్ని అందుకోవడంలో దేశ రాజధాని ఢిల్లీ పాత్ర అత్యంత కీలకంగా పేర్కొన్నారు..
ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారు.. అందులో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను దర్శించుకోవాలనుకున్నారు.. అయితే, దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాల సందర్శనను వాయిదా వేసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రోడ్ల సమస్యకు ముగింపు పలికే దిశగా శరవేగంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందంటూ.. సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రతీ గ్రామంలో నాణ్యమైన రోడ్ల నిర్మాణం చేసి, గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు..
అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలిచిన సంగతి తెలిసిందే.. వరుసగా రెండోసారి అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్లో 9 వికెట్ల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా అండర్-19 భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
అటవీశాఖ ఉన్నతాధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు .. చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలోని అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబం అటవీ భూములు ఆక్రమించారని వెలువడిన సమాచారంపై సమగ్ర విచారణ జరిపి.. నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.. అసలు, పెద్దిరెడ్డి కుటుంబం.. అటవీ భూములు ఏ మేరకు ఆక్రమించింది.. అక్కడ ఉన్న అడవులను ఏ విధంగా ధ్వంసం చేశారో విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు
'జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు.. ఎవరూ అనవసరమైన వివాదాలు, విభేదాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ‘కూటమిలోని మూడు పార్టీల శ్రేణులూ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ కూటమి ఆశయాన్ని కాపాడుకోవాలి. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలపై, కూటమి అంతర్గత విషయాలపై పొరపాటున కూడా ఎవరైనా స్పందించినా, మరెవరూ ప్రతిస్పందించొద్దు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించొద్దు. బహిరంగంగా చర్చించొద్దు అని సూచిస్తూ.. జనసేన శ్రేణులకు బహిరంగ లేఖ విడుదల చేశారు పవన్ కల్యాణ్.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. అయితే, రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్నారు లోకేష్.. బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు లోకేష్‌కి శుభాకాంక్షలు తెలిపుతున్నారు..