అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా ఉన్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారో లేదో వెనిజులాపై దాడి చేసి అధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు గ్రీన్‌లాండ్‌పై కన్నుపడింది.
Greenland: ఆర్కిటిక్ ద్వీపం, డెన్మార్క్ ఆధీనంలో ఉన్న ‘‘గ్రీన్‌ల్యాండ్’’పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది. దీనిని అమెరికాకు ఇచ్చేయాలంటూ ట్రంప్ డెన్మార్క్‌ను బెదిరిస్తున్నాడు. ఈ పరిణామాల నేపథ్యంలో యూరప్ దేశాలు అన్ని ఒక్కటయ్యాయి. గ్రీన్‌ల్యాండ్ భవిష్యత్తును గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ మాత్రమే నిర్ణయించుకోగలవని మంగళవారం యూరోపియన్ నాయకులు ప్రకటించారు.
Louise Fischer: కరోనా మహమ్మారి సృష్టించిన దారుణ పరిస్థితుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా జీవితాలు మెల్లగా సాధారణ స్థితికి చేరుకుంటుండగా.. డెన్మార్క్‌లో ఓ జర్నలిస్టు తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారి తీసింది. డానిష్ రేడియో రిపోర్టర్ లూయిస్ ఫిషర్ (26) స్వింగర్స్ క్లబ్ గురించి కథనం తయారుచేయడానికి వెళ్లి, అక్కడే ఇంటర్వ్యూ మధ్యలో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే.. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన…
Greenland: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతోన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన పనామా కాలువు, కెనడా, గ్రీన్‌ల్యాండ్ ప్రకటనలు సంచలనంగా మారాయి. గ్రీన్‌ల్యాండ్‌ని కొనేందుకు ట్రంప్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తర అమెరికా, రష్యా మధ్య ఆర్కిటిక్ ప్రాంతంలో, యూరప్‌కి వాయువ్యంగా ఉన్న వ్యూహాత్మకంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నారు.
Miss Universe 2024: 73వ మిస్ యూనివర్స్ 2024 పోటీలో విజేతను తాజాగా ప్రకటించారు. డెన్మార్క్‌కు చెందిన 21 ఏళ్ల విక్టోరియా క్జెర్ థెల్విగ్ ఈ ఏడాది మిస్ యూనివర్స్ విజేతగా నిలిచింది.
Noodles Ban : జంక్ ఫుడ్ తినాలనిపిస్తే చాలా మంది ఫస్ట్ ప్రిపరెన్స్ ఇన్ స్టంట్ నూడిల్స్ కే ఇస్తారు. అయితే ఇటీవల డెన్మార్క్ ఫుడ్ అథారిటీ దక్షిణ కొరియాలో తయారైన నూడిల్స్‌ను నిషేధించింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రెండేళ్ల సభ్యత్వం కోసం గురువారం జరిగిన రహస్య బ్యాలట్‌లో పాకిస్థాన్, డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియాలు విజయం సాధించాయి.
డెన్మార్క్ రాణి మార్గరెట్-2 సింహాసనం నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హేగన్‌లోని క్రిస్టియన్ బోర్గ్ ప్యాలెస్‌లో సంబంధిత దస్త్రాలపై ఆమె సంతకం చేశారు. అనంతరం ఆమె పెద్దకుమారుడు ఫ్రెడెరిక్-10ను రాజుగా ప్రకటించారు
Denmark: యూరోపియన్ దేశాల్లో ఇస్లాం పవిత్ర గ్రంధాన్ని అగౌరపరచడం, దైవదూషణ చేయడంపై ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి ప్రవర్తన అక్కడి దేశాల్లో ఉద్రిక్తతను పెంచుతోంది. ఇదిలా ఉంటే డెన్మార్క్ దేశం కీలక బిల్లును అక్కడి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఇస్లాం పవిత్ర గ్రంథం ఖురాన్ ప్రతులను బహిరంగ ప్రదేశాల్లో కాల్చడాన్ని చట్టవిరుద్ధంగా చెబుతూ, గురువారం బిల్లును తీసుకువచ్చింది. ఈ బిల్లుకు అక్కడి పార్లమెంట్ ఆమోదం తెలిపింది.