ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి, తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ తాజాగా పుట్టుకొస్తున్న కొత్త కరోనా వేరియంట్లు ఇంకా కలవరపెడతూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో కొవిడ్ కొత్త వేరియంట్‌ను గుర్తింంచారు. కొత్త వేరియంట్ బీఏ.2.86ను నిశితంగా పరిశీలిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో, యూఎస్ ఆరోగ్య అధికారులు తెలిపారు.
బీర్ బాటిల్ తో యోగా చేయడం ఏంటి? అని విచిత్రంగా అనిపిస్తోంది కదా.. ప్రపంచంలో చాలాచోట్ల ప్రస్తుతం ఈ ట్రెండ్ జోరుగా నడుస్తోంది. 2016లో ప్రారంభమైన బీర్ యోగా ఇప్పుడు అనేక దేశాలకు పాకింది. యోగా డే సందర్భంగా విదేశాల్లో కొందరు వ్యక్తులు చేస్తున్న బీర్ యోగా చూస్తే మీరు షాక్ అవుతారు.
Shock for Food Lovers: ఫుడ్ లవర్స్ కు ప్రపంచంలోని ఫేమస్ రెస్టారెంట్ షాక్ ఇచ్చింది. త్వరలోనే మూసేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి నియంత్రణకు విధిస్తున్న లాక్‌డౌన్ కారణంగా రెస్టారెంట్ మూసివేయబడుతుందని సంస్థ ప్రకటించింది.ఇది ఆహార ప్రియులను షాక్‌కు గురి చేసింది.
డెన్మార్క్ కాల్పులతో ఉలిక్కిపడింది. రాజధాని కోపెన్‌హాగన్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగాడు. ఆదివారం బిజీగా ఉండే మాల్ లోకి ప్రవేశించిన దుండగులు రైఫిల్ తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఇందులో ఒకరు నలబై ఏళ్ల వయస్సున్న వ్యక్తి కాగా.. మరో ఇద్దరు యువకులని డానిష్ పోలీసులు వెల్లడించారు. కాల్పులు జరిపిన నిందితుడిని 22 ఏళ్ల యువకుడిగా గుర్తించారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే డెన్మార్క్ లో కాల్పులు జరగడంతో అక్కడి ప్రజలు…
యూరప్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఇవాళ డెన్మార్క్ వెళ్లారు. తొలిరోజు జర్మనీలో పర్యటించిన ఆయన.. రెండో రోజున అక్కడి నుంచి కోపెన్‌హాగన్ ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. అక్కడ మోడీకి డెన్మార్క్ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సన్ స్వాగతం పలికారు. తర్వాత ఇద్దరూ కలిసి డెన్మార్క్ ప్రధాని అధికారిక నివాసం మానియన్ బోర్గ్‌కు చేరుకున్నారు. అక్కడ ఫ్రెడరిక్సన్.. తన నివాసం మొత్తాన్ని మోడీకి చూపించారు. భారత పర్యటనకు వచ్చినప్పుడు.. తనకు మోడీ గిఫ్ట్‌గా ఇచ్చిన పెయింటింగ్‌ను కూడా…
ఈ ఏడాది తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మే 2 నుంచి మూడు రోజుల పాటు ఆయన విదేశాల్లో పర్యటించనున్నారు. తొలుత ఆయన జర్మనీకి వెళ్లనున్నారు. అక్కడి నుంచి డెన్మార్క్ వెళ్తారు. తిరుగు ప్రయాణంలో మే 4న ప్యారిస్ చేరుకుంటారు. ఈ మేరకు మోదీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. బెర్లిన్‌లో జర్మనీ ఫెడరల్ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్స్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఇండియా జర్మనీ ఇంటర్-గవర్నమెంటల్ కన్సల్టేషన్స్…
కరోనా సెకండ్ వేవ్ ముగిసి క్రమంగా సాధారణ పరిస్థితులు వచ్చాయి.. మొదటల్లో థర్డ్ వేవ్ హెచ్చరికలు ఉన్నా.. తర్వాత.. కరోనా పని అయిపోయిందనే తరహా ప్రచారం కూడా సాగింది.. అయితే, ఇప్పుడు జాగ్రత్తగా ఉంటేనే.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు ఉండదని ఎప్పటికప్పుడు ప్రభుత్వం సూచిస్తూనే ఉంది. కానీ, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని హడలెత్తిస్తోంది.. కరోనా వైరస్ తాజా రూపాంతరం ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.. కొత్త వేరియంట్ వెలుగుచూసిన…
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న నేపథ్యంలో టీకాలను వేగంగా అందించాలని, కరోనా కట్టడికి టీకా వేయడం ఒక్కటే సురక్షిత మార్గం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. ఆక్స్ ఫర్డ్ అస్త్రజెనకా టీకా తో పాటుగా మరికొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఆక్స్ ఫర్డ్ టీకా వినియోగంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టీకా తీసుకుంటే రక్తం గడ్డగడుతుందని పలు నివేదికలు పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఐరోపాలోని కొన్ని దేశాలు ఈ టీకా…