దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వరదల తో పాటుగా సీజనల్ వ్యాదులు కూడా పలకరిస్తాయి.. వరదలు కారణంగా రకరకాల జ్వరాలు, కండ్లకలక తో పాటు డెంగీ భయపెడుతోంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ తగ్గగానే డెంగీ ప్రమాదం తప్పిపోయిందని భావిస్తారు… కానీ జ్వరం తగ్గాకే దీని లక్షణాలు బయట పడతాయని నిపుణులు చెబుతున్నారు.. జ్వరం వచ్చి తగ్గుతున్న సమయంలో వాంతులు అవడం కానీ, పొట్ట విపరీతంగా నొప్పి రావడం జరిగితే డెంగీ లక్షణాలుగా భావించాలి.…
WHO: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించిన సంగతి తెలిసిందే.. మహమ్మాది దాటికి మనుషుల జీవితం అతలాకుతలం అయ్యింది. తగ్గుతుందనుకున్న ప్రతీసారీ తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోనే ఉంది. కరోనా కథ ఇంకా పూర్తిగా ముగియలేదు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెంగీ దడ పుట్టిస్తోంది. ఒకవైపు కరోనా కేసులు పెరుగు తున్న సమయంలో చాపకింద నీరులా డెంగీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో వానాకాలం సీజన్ మొదలైనా ఇంకా వర్షాలు కురవకముందే డెంగీ జ్వరాల బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు సీజన్స్‌కు అతీతంగా సిటీలో విస్తరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నగరంలో 167 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు తగిన చర్యలు…
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగీతో బాధపడుతూ అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం నాడు కన్నుమూశారు. గతంలో ఆశాబెన్ పటేల్ కరోనా బారిన కూడా పడ్డారు. ఇప్పుడు డెంగీ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయారు. ఆమె మరణ వార్తను జైడస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. గతంలో ఆరు సార్లు బీజేపీ తరపున ఉంఝా స్థానం నుంచి…
పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గ్రామస్తులకు వైద్య సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. మలేరియా డెంగ్యూ పరీక్షలు కిట్స్ లేవన్న వైద్య సిబ్బంది తీరుపై ఆగ్రహించారు గ్రామస్తులు. ఇప్పటికే అంతుచిక్కని వ్యాధి తో నలుగురు విద్యార్థులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైన మరో 50 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.వరుస మరణాల నేపథ్యంలో పాఠశాలను బలవంతంగా మూయించారు తల్లిదండ్రులు.
మొన్నటి వరకు కరోనా…ఇప్పుడేమో వైరల్ ఫీవర్లు…ఢిల్లీని టెన్షన్ పెడుతున్నాయ్. వారం రోజుల్లోనే 3వందల మంది డెంగీతో ఆస్పత్రుల్లో చేరారు. దీంతో ఢిల్లీ సర్కార్…కరోనా వార్డులను డెంగీ రోగులకు కేటాయించాలని నిర్ణయించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతుంటే…మరోవైపు డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో…ఆస్పత్రులన్నీ వైరల్ ఫీవర్ బాధితులతో నిండిపోతున్నారు. దీంతో కేజ్రీవాల్ సర్కార్ అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు కేటాయించిన పడకల్లో మూడో వంతు పడకలు… డెంగీ రోగుల కోసం కేటాయించాలని…
దేశంలో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. రోజుకు 40వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కేరళలో వైరస్ తీవ్రత నియంత్రణలోకి రావడం లేదు. గత వారంలో దేశవ్యాప్తంగా నమోదవుతున్న మొత్తం కేసుల్లో 68 శాతం ఒక్క కేరళలోనే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 24గంటల్లో దేశవ్యాప్తంగా 43వేల కేసులు వెలుగు చూడగా.. 338 మరణాలు సంభవించాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కోవిడ్ మరణాలను నివారించడంలో 97శాతం…
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే డెంగ్యూ టెస్ట్ లు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో 1575 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి అని మంత్రి ఆళ్ళ నాని అన్నారు గుంటూరు జిల్లా లో 276 డెంగ్యూ కేసులు, 13 మలేరియా కేసులు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ గాని మలేరియా గాని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరిక్షలు చేపించేలా ఏర్పాట్లు చేస్తున్నం. గుంటూరు జిల్లాలో శానిటేషన్ పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్ ను ఆదేశించాం. డెంగ్యూ కేసులను ఆసరా చేసుకుని…