WHO: ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడించిన సంగతి తెలిసిందే.. మహమ్మాది దాటికి మనుషుల జీవితం అతలాకుతలం అయ్యింది. తగ్గుతుందనుకున్న ప్రతీసారీ తన రూపాన్ని మార్చుకుని విజృంభిస్తోనే ఉంది. కరోనా కథ ఇంకా పూర్తిగా ముగియలేదు.. ఈ లోగానే WHO మరో హెచ్చరిక జారీ చేసింది. ఎల్‌నినో విజృంభించడం వల్ల డెంగ్యూ, జికా, చికున్‌గున్యా మూడు కలిసి విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం మొత్తం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సూచించారు. 2023, 2024లో ఎల్‌నినో డెంగ్యూ, జికా వైరస్, చికున్‌గున్యా వంటి వైరల్ వ్యాధులను పెంచుతుందని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అడ్నోమ్ తెలిపారు. దీనికి అన్ని అవకాశాలు ఉన్నాయి. వాతావరణంలో మార్పుల వల్ల దోమల వృద్ధి పెరుగుతుందని, దీని వల్ల డెంగ్యూ, జికా వైరస్, చికున్‌గున్యా వ్యాప్తి చెందుతుందన్నారు. ఇది ఒకటి రెండు కాదు ప్రపంచంలోని అనేక దేశాలను ప్రభావితం చేస్తుంది.
Read Also:Sajjala Ramakrishna Reddy: పవన్ రాజకీయ నాయకుడే కాదు.. కులంపైనే యాత్ర..!
US నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ NOAA ప్రకారం.. ఎల్ నినో కొత్త ఉష్ణోగ్రత రికార్డులను సెట్ చేయగలదు. ముఖ్యంగా ఎల్ నినో సమయంలో ఇప్పటికే సగటు కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఎదుర్కొంటున్న ప్రాంతాలలో ఎల్ నినో సంఘటనలు సాధారణంగా ప్రతి రెండు నుండి ఏడు సంవత్సరాలకు జరుగుతాయి. ఇది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖ చుట్టూ సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల కంటే వెచ్చగా ఉంటుంది. చివరి ఎల్ నినో సంఘటన ఫిబ్రవరి, ఆగస్టు 2019 మధ్య సంభవించింది. కానీ దాని ప్రభావం అప్పుడు చాలా బలహీనంగా ఉంది. 2016లో ఎల్‌నినో, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రత రికార్డు స్థాయికి చేరుకుంది. WMO విడుదల చేసిన కొత్త అప్‌డేట్ ప్రకారం.. మే,జూలై మధ్య ఎల్ నినోకు 60 శాతం అవకాశం ఉంది. సదరన్ ఆసిలేషన్ (ENSO) ఎల్ నినోగా మారుతుంది.
Read Also:Neena Gupta: పిల్లలకు బూతు పదాలు, శృంగారం నేర్పించాలి.. అది అవసరం