దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. వరదల తో పాటుగా సీజనల్ వ్యాదులు కూడా పలకరిస్తాయి.. వరదలు కారణంగా రకరకాల జ్వరాలు, కండ్లకలక తో పాటు డెంగీ భయపెడుతోంది. సాధారణ జ్వరంలాగే వచ్చే ఈ ఫీవర్ తగ్గగానే డెంగీ ప్రమాదం తప్పిపోయిందని భావిస్తారు… కానీ జ్వరం తగ్గాకే దీని లక్షణాలు బయట పడతాయని నిపుణులు చెబుతున్నారు.. జ్వరం వచ్చి తగ్గుతున్న సమయంలో వాంతులు అవడం కానీ, పొట్ట విపరీతంగా నొప్పి రావడం జరిగితే డెంగీ లక్షణాలుగా భావించాలి.
ఆహారం సరిగా తీసుకోకపోవడం, డల్‌గా ఉండటం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. జ్వరం తీవ్రత ఒక్కొక్కరి లో ఒకో రకంగా ఉంటుందట. 5 రోజుల వరకూ జ్వరం ఉండే అవకాశం ఉంటుందట. అయితే జ్వరం తగ్గే సమయంలో డెంగీ లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. కొందరిలో జ్వరం నుంచి కోలుకునే సమయం లో ఒంటిపై ఎర్రగా ర్యాష్ రావడం వాటి వల్ల విపరీతంగా దురద రావడం, దద్దుర్లు రావడం జరుగుతుంది..
ఇకపోతే ఈ జ్వరం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణాల ను చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.. ఈ జ్వరం బారిన పడిన అందరిలో ర్యాష్ లక్షణాలు కనిపించడం కానీ , జ్వరం తగ్గి మరల రావడం వంటి లక్షణాలు కనిపించకపోవచ్చునని వైద్యులు చెబుతున్నారు. జ్వరం వచ్చినపుడు పారా సిట్‌మాల్ వాడాలని లేదంటే వెంటనే వైద్యుని సంప్రదించడం అవసరమైతే ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం మంచిదని చెబుతున్నారు.. ఇకపోతే వర్షా కాలం లో ఎటువంటి వ్యాదులు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారాన్ని ఎప్పటికప్పుడు చేసుకొని వేడిగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు…