పెద్ద నోట్ల రద్దు చర్య తర్వాత ఆరేళ్ల తర్వాత కూడా నగదు వినియోగం ఇంకా తగ్గలేదు. ప్రజల వద్ద ఉన్న కరెన్సీ అక్టోబరు 21 నాటికి రూ. 30.88 లక్షల కోట్ల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది.
‘Note’ these points: దాదాపు ఆరేళ్ల కిందట పెద్ద నోట్లను రద్దు చేయటం వల్ల కలుగుతున్న ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలు ఆషిమా గోయెల్ అన్నారు. పన్నుల వసూళ్లు పెరగటానికి ఈ నిర్ణయం పరోక్షంగా దోహదపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎకానమీ.. డిజిటల్ బాటలో శరవేగంగా పయనిస్తోందని చెప్పారు.
ప్రభుత్వ విధాన నిర్ణయాలపై న్యాయసమీక్ష పరిమితులకు సంబంధించిన లక్ష్మణరేఖ ఎక్కడుందో తమకు తెలుసని.. అయినా 2016లో ప్రధాని మోదీ సర్కారు ప్రకటించిన నోట్ల రద్దు అంశాన్ని పరిశీలించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. బీజేపీ పార్టీని, 2024 ఎన్నికలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ పురూలియాలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం జాతీయ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తోందని ఆరోపించార. వచ్చే 2024 ఎన్నికల్లో బీజేపీ గెలవబోదని జోస్యం చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ను ‘కల్తీ’గా అభివర్ణించారు. నోట్ల రద్దు,…
అప్పట్లో పెద్దనోట్లు (రూ.వెయ్యి, రూ.500 పాత నోట్లు)ను రద్దు చేసి సంచలనానికి తెరలేపారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఈ సమయంలో.. ప్రజలు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.. ఇక, అప్పుడే.. రూ.2 వేల నోటును ముద్రించింది ఆర్బీఐ.. అది కాస్త చిల్లర కష్టాలు రుచిచూపించగా.. ఆ తర్వాత రూ.500 కొత్త నోటు, రూ.200 కూడా వచ్చేశాయి.. క్రమంగా అన్ని నోట్లు.. రంగులు మారుతూ పోయాయి.. సైజులు కూడా తగ్గిపోయాయి. నోట్ల రద్దు తప్పుడు నిర్ణయమని.. ఇదే.. భారత…