దేశంలో ప్రమాదకర ఘడియలు దగ్గర పడుతున్నాయి.. రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డాయని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్- వన్ ఎలక్షన్ కోసం ఓ కమిటీని మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసింది. దీనిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశంలోని ప్రజాస్వామ్యాన్ని అభినందిస్తూ.. వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్‌ల కోఆర్డినేటర్‌గా ఉన్న జాన్ కిర్బీ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశంలో ప్రజాస్వామ్యం శక్తివంతంగా ఉందని అన్నారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన తర్వాత దేశ రాజకీయాలు వేడెక్కాయి. ఓవైపు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూనే మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తున్నారు. విపక్షాలు ఏకం అవుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలోని ప్రజాస్వామ్య సంస్థలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని, వాటిని చూసి ఓర్వలేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఇండియా టుడే కాన్క్లేవ్ 2023లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం కీలకోపన్యాసం చేస్తూ.. భారత ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య సంస్థల విజయం కొందరిలో అసూయను కలిగిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో లేదని, కాంగ్రెస్ పార్టీకే ప్రమాదం ఉందని అన్నారు. దేశంలో ప్రమాదంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీకే తప్ప ప్రజాస్వామ్యానికి కాదన్నారు.