Minister Nara Lokesh: పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది!.. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం.. భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని నారా లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.