Minister Nara Lokesh: పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచిందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది!.. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం.. భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదు అని నారా లోకేష్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
READ MORE; Wedding Drama: మొదటి భార్య కంప్లెయింట్.. నిత్య పెళ్లి కొడుకు బండారం బట్ట బయలు!
మరోవైపు.. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను బలవంతంగా కైవసం చేసుకునేందుకు చంద్రబాబు దారుణాలకు పాల్పడ్డారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాష్ట్రాన్ని రౌడీల పాలన వైపు నడిపిస్తున్నారన్నారు.. ముఖ్యమంత్రిగా తన అధికారాలను దుర్వినియోగం చేశారు.. అధికారులను తన ఆధీనంలోకి తీసుకుని, పోలీసులను మోహరించి ఎన్నికలను ఒక ఉగ్రవాదిలా హైజాక్ చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.. ప్రజాస్వామ్యం దెబ్బతిన్న ఇవాళ నిజంగా బ్లాక్ డే అంటూ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు..
READ MORE; YSRCP: జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు.. రి పోలింగ్ డిమాండ్..!
#FreedomAfter30Years
పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది! 30 ఏళ్ల తరువాత ప్రజలంతా నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు. వైసిపి మూర్ఖత్వానికి మరణం లేదని మరోసారి రుజువైంది! ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడం… భయపెట్టి… pic.twitter.com/leziLcQ1RY— Lokesh Nara (@naralokesh) August 12, 2025