Delhi : హోలీ పండుగ, రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి కూడలిలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈరోజు ఢిల్లీలోని పీపీ సుబ్రొతో పార్క్‌లోని ఝరేరా ఫ్లైఓవర్ సమీపంలో నలుగురి నుంచి రూ.3 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Delhi: ఢిల్లీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ట్యూషన్ టీచర్ సోదరుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్లో ట్యూషన్ టీచర్ ఇంట్లో ఈ ఘటన జరిగింది.
ఢిల్లీ మెట్రో రైలులో ఇప్పటి వరకు ఎన్నో రకాల వీడియోలు తీసి వైరల్ చేసిన సంగతి తెలిసిందే. వైరల్ వీడియోల్లో ఢిల్లీ మెట్రోకు సంబంధించిన వీడియోలు నిత్యం కనపడుతూనే ఉంటాయి. అందులో డ్యాన్స్ చేసేవి, కొట్టుకునేవి, పాటలు పాడేవి ఇలాంటి ఎన్నో రకాలైన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా మరొక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మెట్రో రైలులో ఇద్దరు అమ్మాయిలు హోలీ వేడుకలు జరుపుకుంటున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.…
Lok Sabha Elections 2024: 2024 లోక్‌సభ ఎన్నికలకు బిజెపి అభ్యర్థుల ఐదవ జాబితా ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల (ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్) అభ్యర్థుల పేర్లను విడుదల చేసే జాబితా మధ్యాహ్నం వచ్చే వీలుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.
AAP: ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జెపి నడ్డాను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్‌లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని గురువారం రాత్రి ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షించలేమని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసంలో సోదాలు నిర్వహించారు. సోదాల తర్వాత ఆయనను అరెస్ట్ చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని నిన్న ఈడీ అరెస్ట్ చేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ కాకుండా రక్షణ ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే నిన్న సాయంత్ర కేజ్రీవాల్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు ఆయన కస్టడీ కోసం రోస్ ఎవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.