Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే నేత పొన్ముడిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించడానికి అభ్యంతరం వ్యక్తం చేయడంపై గవర్నర్ ప్రవర్తనను ధర్మాసనం తప్పుపట్టింది.
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్‌కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. హఠాహత్తుగా ఆయనకు ఆరోగ్యం సీరియస్ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్‌లో ఒక్కసారిగా బలహీన పడ్డ కాంగ్రెస్.. ప్రస్తుతం అనూహ్యంగా కొత్త జోష్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది.
దేశంలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.