దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. ఈస్ట్ ఢిల్లీలోనే కల్యాణ్‌పురి ఏరియాలో సాయంత్రం ఒక్కసారిగా భవనం కూలిపోయింది. భారీ శబ్దంతో కూలిపోయింది. దీంతో సమీపంలో ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. మరోవైపు భారీ ఎత్తున దుమ్ము చెలరేగడంతో స్థానిక ప్రజలు ఊపిరాడక ఇబ్బందులు పడ్డారు. భవనం కూలిన దృశ్యాన్ని స్థానికులు మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది.
ఇది కూడా చదవండి: Mahindra XUV 3XO: నెక్సాన్, బ్రెజ్జాకు చుక్కలే.. మహీంద్రా XUV 3OO ఫేస్‌లిఫ్ట్ సరికొత్త ఫీచర్లు..
శనివారం నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన ఘటనలో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. తూర్పు ఢిల్లీలోని కళ్యాణ్‌పురి ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయంలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిందని వెల్లడించారు. పెద్ద శబ్దంతో కూలిపోవడంతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి మబ్బులు చుట్టుముట్టాయి. అలాగే శిథిలాలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లపై పడ్డాయి. నిర్మాణ పనులు జరుగుతుండగానే భవనం ఓ వైపు ఒరిగింది. పోలీసులు ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నారు. సమీప ఇళ్లల్లోనే ప్రజలను ఖాళీ చేయించారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. అధికారులు అప్రమత్తమై శిథిలాలను తొలగించారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా సహాయ చర్యలు చేపట్టి.. శిథిలాలను తొలగించారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: ఒక ఎన్నిక కోసం పిఠాపురం రాలేదు