స్వీట్ అంటేనే తీయగా ఉంటుంది. అయితే, ఈ స్వీట్ తీపితో పాటు కాస్తంత మధురానుభూతిని కూడా ఇస్తుంది. జస్ట్ టేస్ట్ చేస్తే చాలు… మొత్తం తినేయ్యాలనిపిస్తుంది. కానీ, అలా మొత్తం తినాలంటే చాలా డబ్బులు పెట్టాలి. ఈ స్వీట్ కిలో ధర జస్ట్ 16 వేల రూపాయలు మాత్రమే అంటున్నారు షాపు యాజమాన్యం. అంత ఖరీదు ఉండటానికి అందులో ఏమైనా బంగారం కలుపుతారా ఏంటి అంటే… అవుననే సమాధానం ఇస్తున్నారు స్వీట్ షాప్ సిబ్బంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్‌పై బంగారం రేకులను పూతగా వేస్తారు.
Read: బటన్ నొక్కితే చాలు… ఈ కారు రంగు మారిపోతుంది…!!
దీంతో ఆ స్వీట్స్ గోల్డ్ కలర్‌లోకి మారిపోతాయి. నోరూరించే ఈ గోల్డెన్ స్వీట్‌పై అదనంగా నాణ్యమైన కుంకుమ పువ్వును ఉంచుతారు. ఈ స్వీట్స్ కావాలంటే ఢిల్లీ వరకు వెళ్లాలి. ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న షాగున్ స్వీట్ షాపు ఇలాంటి యూనిక్ స్వీట్స్‌కు ప్రసిద్ది. దీనికి సంబంధించిన వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి