స్వీట్ అంటే ఇష్టపడని వారెవరు.. పండగ అయినా, శుభకార్యం అయినా స్వీట్ లేకుండా పూర్తవదు. తీపి కబురు చెప్పడానికైనా, తీపి ముచ్చట్లు పెట్టుకోవడానికైనా స్వీట్ కంపల్సరీ. అయితే ఒక కేజీ స్వీట్స్ ఎంత ఉంటుంది.. రూ. 300.. పోనీ రూ. 500. అంతకంటే ఎక్కువ ఉండదు. కానీ, ఇక్కడం మనం చెప్పుకొనే మిఠాయి కేజీ రూ. 16 వేలు. ఏంటీ తమాషా చేస్తున్నారా..? ఒక్క కేజీ స్వీట్స్ అంత రేటు ఎందుకు అని కోపంగా చూడక్కర్లేదు. ఎందుకంటే ఆ రేటు పెట్టడానికి ఆ స్వీట్ కి ఒక ప్రత్యేకత ఉంది మరీ. అది ఏంటంటే ఆ స్వీట్ ని బంగారంతో తయారు చేస్తారు కాబట్టి.. దానికి అంత రేటు.
ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఉన్న షాగూన్ స్వీట్ దుకాణంలో ఈ బంగారు స్వీట్ దొరుకుతోంది. ఈ స్వీట్ ని ఎలా తయారుచేస్తారు అంటే.. ఈ మిఠాయిని తయారుచేసిన తరువాత వాటిపై 24 క్యారెట్ల బంగారు రేకులను పూతగా పోస్తారు.. అనంతరం వాటిని ముక్కలుగా కట్ చేసి వాటిపై ఒరిజినల్ కుంకుమపువ్వును డెకరేట్ చేస్తారు. ఆ షాపులో ఈ స్వీట్ చాలా ప్రత్యేకం. అంతేకాదు దీని రుచి కూడా డబ్బుకు తగ్గట్టే ఉంటుందంట. దీంతో డబ్బు ఎక్కువైనా పర్లేదని ప్రజలు ఈ స్వీట్ కోసం ఎగబడుతున్నారట. ఏది ఏమైనా రుచి కావాలనుకొనేవారికి డబ్బుతో పనేముంది. ప్రస్తుతం ఈ సవవట తయారీకి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి మీకుండా ఈస్వీట్ తినాలనిపిస్తుందా..? అయితే ఛలో ఢిల్లీ..
https://www.instagram.com/p/CX7zz6EoKtG/