ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోచింగ్ సెంటర్ మంటలు చెలరేగడంతో ప్రాణాలు రక్షించుకునేందుకు విద్యార్థులు తాడు సాయంతో కిందికి దూకారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు.
కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్సుకి వ్యతిరేకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు కూడగడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బుధవారం సీపీఐ జాతీయ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ పోరాటానికి మద్దతుగా ఉంటామని సీపీఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు.
Unfriendliest Cities: కొత్తవారితో స్నేహం చేయాలనుకుంటున్నారా..? అయితే ముంబై, ఢిల్లీ నగరాల్లో ఇది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ముంబై, ఢిల్లీ నగరాలు ‘అన్ ఫ్రెండ్లీ సిటీ’ల జాబితాలో నిలిచాయి. కమ్యూనిటీ స్పిరిట్ ఇండెక్స్: వరల్డ్స్ ఫ్రెండ్లీఎస్ట్ సిటీస్ ఫర్ నాన్ నేటివ్స్ ప్రపంచంలోని 53 నగరాల్లో నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.
విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్‌పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
దేశ రాజధానిలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆయన ఫైరయ్యారు. అంతేకాకుండా ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎల్-జి ద్వారా కేంద్రానికి ప్రభుత్వాన్ని నడిపించే నియంత్రణను సమర్థవంతంగా మంజూరు చేసే కేంద్రం ఆర్డినెన్స్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఢిల్లీ మెట్రో రైలులో ఓ యువకుడు ట్రైన్ డోర్‌ను కాళ్లతో అడ్డుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భవనాలు, కాంప్లెక్స్‌లతో లిఫ్ట్ మాదిరిగానే ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ మెట్రో ట్రైన్‌లోనూ ఉంటుంది. ఇలా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించే వారిపై ఫిర్యాదు చేయడానికి మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రకటించింది. అయితే ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న కొందరు ఆకతాయి యువకులు రూల్స్ ను బ్రేక్ చేశారు.
Supreme Court: ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించించింది. ఈ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది.
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా భార్య సీమా సిసోడియా 103 రోజుల తర్వాత తన భర్తను కలిసింది. మనీష్ సిసోడియా ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా తన జీవిత భాగస్వామిని కలవడానికి ఢిల్లీ హైకోర్టు అనుమతించింది. దాదాపు 7 గంటల పాటు వాళ్లిద్దరూ కలిసి ఉన్నారు.