Delhi Metro: ఢిల్లీ వాసుల ప్రయాణాలకు ఎంతో కీలకమైన ఢిల్లీ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. గత 20 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న మెట్రో.. తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఒక్కో ప్రయాణికుడు పూర్తిగా సీల్ చేసిన రెండు లిక్కర్ బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) ప్రకటించింది. అయితే మెట్రో ప్రాగణంలో మద్యం సేవించడం ఇప్పటికీ ఖచ్చితంగా నిషేధించబడుతుంది.
Read Also: CM Yogi Adityanath: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ భూమిని పేదలకు పంచిన సీఎం యోగి ఆదిత్యనాథ్..
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) మరియు డిఎంఆర్‌సి అధికారులతో కూడిన కమిటీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మినహా రైళ్లలో మద్యం రవాణా చేయడాన్ని నిషేధించిన మునుపటి ఆర్డర్‌ను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని నిబంధనలకు సమానంగా ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లడానికి కమిటీ అనుమతించబడింది.
ద్వారకా సెక్టార్ 21 మరియు నోయిడా ఎలక్ట్రానిక్ సిటీలను కలిపే బ్లూ లైన్‌లో ప్రయాణిస్తున్న మెట్రోలో మద్యం తీసుకెళ్లగలరా? అని ఓ యూజర్ ట్విట్టరన్ ద్వారా ప్రశ్నించాడు. ఆ సందర్భంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ బదులిస్తూ..‘‘హాయ్.. ఢిల్లీ మెట్రోలో 2 సీల్డ్ ఆల్కహాల్ బాటిళ్లకు అనుమతి ఉంది’’ అని బదులిచ్చింది. మద్యం మత్తులో ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు సూచించారు.
DMRC issues official statement – Two sealed bottles of alcohol per person is allowed to be carried on the Delhi Metro at par with the provisions on the Airport Express Line. A committee comprising officials from CISF and DMRC have reviewed the earlier order. As per an earlier… pic.twitter.com/JPI9QBu95w
— ANI (@ANI) June 30, 2023