ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, 35 ఏళ్ల మహిళ తన మైనర్ మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంతే కాకుండా అతనితో కలిసి జీవించాలని పట్టుబడుతోంది. అతడే తన భర్త అని చెబుతోంది. మైనర్ బాలుడి కుటుంబీకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు అక్కడికి చేరుకున్నారు.. మైనర్ వయస్సు ధృవీకరణ పత్రం ద్వారా ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దేశ రాజధానిలో 20 ఏళ్ల మహిళను కారు ఢీకొట్టి 13 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన ఘటన జరిగిన వారం తర్వాత ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 1న జరిగిన ఈ ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది.
ఢిల్లీ యువతి అంజలీ సింగ్‌ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసు కీలక మలువులు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో మరో ఇద్దరు అనుమానితులు బయటపడ్డారు. వ్యక్తులు కారు యజమాని అశుతోష్, నిందితులలో ఒకరి సోదరుడు అంకుష్ అని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు ఈ రోజు తెలిపారు.
ఢిల్లీ యువతి అంజలీ సింగ్‌ను కారు 12కి.మీ పాటు ఈడ్చుకెళ్లిన కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో సంచలనం సృష్టించిన ఈ కేసు.. నిరసనలతో కేంద్రంలోనూ కదలికలు తీసుకొచ్చింది. అయితే పోలీసు దర్యాప్తు పట్ల బాధిత కుటుంబం సంతృప్తిగా ఉన్నా.. ఇటీవల వాళ్లు ఇచ్చిన స్టేట్ మెంట్ ఈ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది.
ఢిల్లీలో స్కూటీపై వెళ్తున్న యువతిని కారుతో ఢీకొట్టి 13 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. అంజలి పోస్టుమార్టం రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి.
దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అయితే తాజాగా యువతి మృతదేహం శవపరీక్ష పూర్తి అయింది
నూతన సంవత్సరం వేళ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో ఆదివారం తెల్లవారుజామున 20 ఏళ్ల యువతిని కారు ఢీకొట్టి ఆమెను 12 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లింది. కిలోమీటర్ల మేర యువతిని కారు ఈడ్చుకెళ్లడం వల్ల ఆమె శరీరం ఛిద్రమెంది. యువతిని కారు ఈడ్చుకెళ్లడాన్ని చూసిన స్థానికుడు పోలీసులకు సమాచారం అందించగా.. అన్ని చెక్‌పోస్ట్‌లను అలర్ట్ చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Assault on Cab Driver: అరగంట ఆలస్యం అయిందని ఓ క్యాబ్ డ్రైవర్ ను చితకబాదిన ఘటన హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న ఆదివారం అర్ధ రాత్రి 11 గంటల సమయంలో ఉప్పర్ పల్లి కి చెందిన వినయ్ రెడ్డి అనే యువకుడు ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. అయితే ట్రాఫిక్ ప్రభావమో లేక, ఏ ఇతర కారణమో ఓలా క్యాబ్ డ్రైవర్ ఆర గంట ఆలస్యంగా వచ్చాడు. దీంతో క్యాబ్…