Delhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అధికారానికి బ్రేకులు వేసింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 48 స్థానాలను కైవసం చేసుకుంది. అయితే, ప్రస్తుతం ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీ ఈ వారం అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాతే ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి.