Delhi Blast: చారిత్రాత్మక ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడుకు జైష్-ఎ-మొహమ్మద్ (జెఎం)తో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్టుతో ఈ విషయం మరింత నిర్ధారణ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కుట్రలు అమలు చేయడానికి జైష్ మహిళా విభాగాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పలు నివేదికల ప్రకారం.. ఈ ఉగ్రసంస్థకు భారతదేశంలో జమాత్-ఉన్-మోమినాత్ అని పిలిచే విభాగానికి డాక్టర్ షాహీన్ స్థానిక నాయకురాలు. ఈ విభాగం మహిళలను…
Mehbooba Mufti: ఢిల్లీ ఎర్రకోట కార్ బాంబ్ బ్లాస్ట్ ఘటనలో 9 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఉగ్రదాడికి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. నిందితులు డాక్టర్లుగా ఉంటూనే ఉగ్రవాదానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అయితే, ఈ ఘటనపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మహబూబా ముఫ్తీ స్పందించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్ల తల్లిదండ్రుల్ని విచారణ పేరుతో ‘‘వేధించవద్దు’’ అని అన్నారు.…
Hafiz Saeed: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడి తర్వాత లష్కరే తోయిబా (LeT) నాయకుడు, ఉగ్రవాది హఫీజ్ సయీద్ మళ్లీ వార్తల్లో నిలిచాడు. పేలుడుకు ఒక రోజు ముందు లష్కరే కమాండర్ సైఫుల్లా వీడియో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోలో సైఫుల్లా మాట్లాడుతూ.. హఫీజ్ సయీద్‌ను మౌనంగా ఉండవద్దని కోరుతూ కనిపించాడు. ఇదే సమయంలో భూటాన్ పర్యాటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ఢిల్లీ బాంబ్ పేలుడు సూత్రధారులను విడిచిపెట్టబోమని…
Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకొట కార్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హ్యాందాయ్ i20లో అమ్మోనియం నైట్రేట్, ఫ్యూయల్ ఆయిల్ కలిపి పేలుడుకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో 12 మంది మరణించారు. సంఘటన జరిగిన రోజు 9 మంది మరణించగా, చికిత్స పొందుతూ ఈ రోజు మరో ముగ్గురు మరణించారు. అయితే, ఈ ఘటనకు పుల్వామా దాడికి కారణమైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ మధ్య సంబంధాలు బయటపడినట్లు…
Delhi Car Blast: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం పేలుడు దద్దరిల్లింది. ఈ బాంబు పేలుడులో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందగా, 24 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారందరిని ఎల్ఎన్‌జేపీ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి NIA, NSG బృందాలు చేరుకున్నాయి. ఢిల్లీలో కారు…
Delhi Car Blast: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో ఈ ప్రమాదం సంభవించినట్లు సమాచారం. ఈ పేలుడు ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 వద్ద సంభవించింది. కారు పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ పేలుడు కారణంగా కారులో మంటలు చెలరేగాయి, అలాగే మరో మూడు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు ధాటికి సమీపంలో పార్క్ చేసిన వాహనాల…