Arvind Kejriwal Arrested: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు. మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను రెండు గంటల పాటు విచారించిన అనంతరం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది.
Arvind Kejriwal : మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం గురువారం సాయంత్రం ఆయన అధికారిక నివాసంలో విచారించి, సోదాలు చేసి, ఏపీజేలోని అబ్దుల్ కలాం రోడ్డులోని తమ కార్యాలయానికి తీసుకువచ్చింది.
KTR-Harish Rao: ఇవాళ కవితను కలిసేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ సామ్ లో అరెస్ట్ అయిన కవితను ఇవాళ ఆదివారం సాయంత్రం కోర్టు నిర్దేశించిన సమయంలో కేటీఆర్, హరీష్ రావులు కలిసే అవకాశం ఉందని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు.
Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి చిక్కుముడి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ జడ్జి రాకేష్ సయల్ నిరాకరించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు ఈడీ అధికారులు. గత నాలుగు రోజుల నుంచి అమిత్ అరోరా ను ఈడీ విచారిస్తుంది. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా ఈడీకి ఇచ్చారు. కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ లాబీ కీలకంగా వ్యవహరించింది. ఈ క్రమంలో కవితను ఈరోజు ఈడీ అరెస్ట్ చేసింది. కవితను రాత్రికి…
దర్యాప్తు సంస్థలు మహిళలను కార్యాలయానికి పిలవకుండా వారి ఇంట్లోనే విచారించాలనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన నోటీసులను కవిత గతేడాది సవాల్ చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు స్వల్ప ఊరట లభించింది. తన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం మనీష్ సిసోడియాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ సమన్లను సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈనెల 16కు వాయిదా వేసింది. న్యాయమూర్తులు బేల ఎం త్రివేది, పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, సమన్లు జారీ చేసినప్పటికీ ఆమె హాజరుకావడం లేదని సుప్రీంకోర్టుకు తెలియజేయగా, తదుపరి తేదీ వరకు మధ్యంతర ఉపశమనం మంజూరు…