భారతీయ మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియాను నోరు మూయించ లేరని, వాటిని కొనుగో చేయలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక వ్యక్తిని కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈయన గతంలో ప్రముఖుల వద్ద సీఏగా పనిచేశారు. అతడి అరెస్ట్ సంచలనంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ చేసింది. రామచంద్ర పిళ్లై వద్ద చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబును ఈరోజు ఉదయం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.
Delhi liquor scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ స్కామ్ లో ఈడీ చార్జీషీట్ లో కీలక వ్యక్తుల పేర్లను చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును కూడా చేర్చింది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మరో 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆదివారం నాడు తన కార్యాలయంపై సీబీఐ దాడిపై అధికారిక ప్రకటన విడుదల చేశారు. మొత్తం సీబీఐ కసరత్తు దురుద్దేశపూరిత చర్యగా అభివర్ణించారు.
ఢిల్లీ సెక్రటేరియట్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సోదాలు నిర్వహిస్తోంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసం, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు చేపట్టింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వాఖ్యలు చేశారు. లిక్కర్ కేసులోకి తెలంగాణ వాళ్ళను రమ్మని మేం పిలవలేదన్నారు. దర్యాప్తు జరుగుతుంటే కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేర్లు వచ్చాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి. నిప్పులు వస్తుందో లిక్కర్ వస్తుందో మాకు తెలియదని చురకలంటించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ కు చెందిన ప్రవీణ్ కుమార్ పేరు తెరమీదకు వచ్చింది. హైదరాబాద్ కు చెందిన చార్డెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఉన్నాడు ఈడీ చార్జీషీట్ లో ప్రవీణ్ పేరు నమోదు చేసి.. ప్రవీణ్ కుమార్ పాత్రపై ఈడీ అధకారులు దర్యాప్తు చేస్తున్నారు.