బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాజగోపాల్ అన్న తొందరపడకు, మాట జారకు అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈడీ ఛార్జిషీట్‌లో 28 సార్లు తన పేరు చెప్పించినా.. 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని ట్విటర్ వేదికగా వెల్లడించారు.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్‌రెడ్డి, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను చేర్చింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాదులోని కవిత నివాసంలో కొద్దిసేపటి కిందట విచారణ ముగిసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్ కూతురు కవిత.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మరో లేఖ రాశారు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొద్ది రోజుల క్రితం సీఆర్‌పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన కలవాలని సూచించారు. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్‌ఏ రాసిన లేఖ కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీని కూడా తనకు వీలైనంత…
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్‌పీసీ కింద వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి కేవలం వివరణ కోసమే నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది.