సార్వత్రిక ఎన్నికల వేల కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆదాయపు పన్ను వివాదంలో న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది.
Delhi High Court: భర్తను తన కుటుంబం నుంచి విడిగా జీవించాలని భార్య కోరడం క్రూరత్వానికి సమానమే అని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వివాహం అనేది భవిష్యత్తు జీవితంతలో బాధ్యతలను పంచుకోవడమే అని, తన భార్య ఇంటి పనులు చేయాలని భర్త ఆదేశించడాన్ని క్రూరత్వంగా పేర్కొనలేమని కోర్టు చెప్పింది. పెళ్లయిన స్ట్రీని ఇంటి పని చేయమని కోరడం పనిలో సహాయం చేసినట్లు కాదని, ఇది ఆ కుటుంబం పట్ల ఆమెకున్న ప్రేమ, ఆప్యాయతగా పరిగణించబడుతుందని చెప్పింది. తన…
Delhi : సునంద పుష్కర్ జనవరి 17, 2014న హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సునంద పుష్కర్ స్వతహా పెద్ద వ్యాపారవేత్త. శశి థరూర్ భార్య కావడంతో ఈ వ్యవహారం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.
Delhi HC: భార్యపై ఆమె తల్లిదండ్రుల అతి ప్రభావం కూడా క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. వివాహ బంధం ఏర్పాటుకు ఆటంకం కలిగిస్తూ.. తల్లిదండ్రుల మితిమీరిన ప్రభావానికి లోనైన భార్య, అతని భర్తపై క్రూరత్వానికి పాల్పడినట్లు పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఇటీవల ఓ వ్యక్తి విడాకులు మంజూరు చేసింది. భార్యభర్తల వైవాహిక జీవితంలో కుటుంబ సభ్యులు అనవసరమైన జోక్యాన్ని కలిగి ఉన్నారని, ఇది భర్తకు బాధ కలిగించిందనే సాక్ష్యాలు ఉన్నాయని జస్టిస్ సురేష్ కుమార్ కైత్,…
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh)కు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
Delhi High Court: భర్త ఆర్థిక పరిమితికి మించి కోరికలు, కలలని నెరవేర్చాలని భార్య ఒత్తిడి చేయడం నిరంతర అసంతృప్తికి కారణమవుతుందని, చివరకు వైవాహిక జీవితంలో సంతోషం, సామరస్యానికి భంగం కలుగుతుందని, ఇది మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. భార్య క్రూరత్వం కారణంగా ఓ జంట విడాకుల కేసులో, విడాకులను సమర్థిస్తూ.. జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ నీనా బన్సల్ కృష్ణలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది.
అయోధ్య రామమందిర ప్రసాదాన్ని అందజేస్తామని చెబుతున్న వెబ్‌సైట్‌ను అన్ని సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ వెబ్‌సైట్ ప్రజల విశ్వాసం, వారి మనోభావాల ముసుగులో మోసం చేస్తోందని, అది కూడా ఖాదీ పేరును ఉపయోగిస్తోందని జస్టిస్ సంజీవ్ నరులా ధర్మాసనం పేర్కొంది. వెబ్‌సైట్ యజమానులు సాధారణ ప్రజలను మోసం చేశారని, తీసుకున్న డబ్బుకు రసీదు లేదా ప్రసాదం చేరినట్లు ఎటువంటి రుజువు ఇవ్వలేదని కోర్టు పేర్కొంది.
Butter Chicken: బటర్ చికెన్.. ఈ పేరు మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్. ఈ రెసిపి ఇండియాలోనే మొదలైనప్పటికీ.. దాని టేస్ట్ మాత్రం ప్రపంచానికి చేరింది. తాజాగా ఈ వంటకం కోసం రెండు రెస్టారెంట్లు ఢిల్లీ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగాయి. బటర్ చికెన్‌తో పాటు దాల్ మఖ్కీ తామే కనిపెట్టామనే ట్యాగ్ వాడుకోవడంపై మోతీ మహల్, దర్యాగంజ్ రెస్టారెంట్లు ఫైట్ చేస్తున్నాయి.
Delhi High Court : భారతదేశంలో విదేశీ పౌరుల నివాసం, సెటిల్మెంట్కు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగం విదేశీ పౌరులెవరూ భారతదేశంలో నివసించే, స్థిరపడే హక్కును పొందేందుకు అనుమతించదని కోర్టు పేర్కొంది.
Pregnancy termination: భర్త మరణంతో ఏడాదిగా మానసిక క్షోభను అనుభవిస్తున్న భార్య, తన 27 గర్భాన్ని వైద్యపరంగా రద్దు చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు గురువారం అనుమతించింది. మానసిక పరిస్థితికి సంబంధించిన రిపోర్టును పిటిషనర్ కోర్టుకి సమర్పించింది. ఈ నివేదికను పరిగణలోకి తీసుకున్న జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ గర్భ విచ్ఛత్తికి అనుమతించారు. ‘‘పిటిషనర్ వివాహ స్థితిలో మార్పు ఉంది. ఆమె వితంతువు అయింది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.