Delhi HC: భర్త మరో మహిళతో కలిసి సహజీవనం చేయడంతో పాటు బిడ్డను కూడా కలిగి ఉండటం ‘‘గృహహింస’’గానే పరిగణించబడుతుందని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పంది. గృహహింస చట్టం ప్రకారం భార్య గృహహింసకు గురవుతుందని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తన భార్యకు నెలకు రూ. 30,000 భరణం చెల్లించడాన్ని వ్యతిరేకిస్తూ భర్త దాఖలు చేసిన పిటిషన్‌ని కోర్టు తిరస్కరించింది.