ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగగా కోర్టు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 30వ తేదీకి రిజర్వ్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు వివక్ష, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పలు రాష్ట్రాల్లోని 40 ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది.