ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈరోజు విచారణ జరగగా కోర్టు తన నిర్ణయాన్ని ఏప్రిల్ 30వ తేదీకి రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా, ఈడీ తరపు న్యాయవాది ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాతో మాట్లాడుతూ.. సిసోడియాను ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా సుప్రీంకోర్టు- హైకోర్టు పరిగణించింది.. ఆయన బయటకు వెళ్తే ఈ కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సిసోడియా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేసి.. వెనక్కి తీసుకున్నాడు.
Read Also: Son Stabbed Mother: దారుణం.. కన్నతల్లిని కత్తితో పొడిచిన కసాయి కొడుకు
కాగా, మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీష్ తీహార్ జైలులో ఉన్నాడు. సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 2023 ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అలాగే, సీబీఐ ఎఫ్‌ఐఆర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో సిసోడియాను 2023 మార్చి 9వ తేదీన ఈడీ అరెస్టు చేసింది. ఇక, 2023 ఫిబ్రవరి 28న సిసోడియా ఢిల్లీ కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. అయితే, మనీష్ సిసోడియా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ప్రతిసారీ అతని పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. మార్చి 2024లో, సిసోడియా మళ్లీ ట్రయల్ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.