Aravind Kejriwal : యమునా జలాలపై రాజకీయ వివాదం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. ఢిల్లీ ప్రజలకు పరిశుభ్రమైన నీటిని అందించి, భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు నాకు రాజ్యాంగ విరుద్ధమైన శిక్ష విధించినా, దానిని నేను స్వాగతిస్తున్నానని కేజ్రీవాల్ అన్నారు.
ఇదిలా ఉంటే, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై ఆయన గురువు, ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ అవినీతిపై స్పందిస్తూ.. ‘‘ఇది దురదృష్టకరం. ఆయన నాతో స్వచ్ఛంద సేవకుడిగా ఉన్నారు. జీవితంలో మీ ప్రవర్తన , అభిప్రాయాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని నేను ఎప్పుడూ అతనికి చెప్పేవాడిని.
Aravind Kejriwal : యమునా నది జల కాలుష్యంపై తన ప్రకటనలకు సంబంధించి ఎన్నికల సంఘం నోటీసుకు ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.
కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
Manish Sisodia: దేశ రాజధానిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార, విపక్ష పార్టీలైన ఆప్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో రామాయణంలో మాయ లేడి లాంటి బీజేపీ నేతలను చూసి మోసపోవద్దని ఆప్ సినీయర్ నేత మనీశ్ సిసోడియా తెలిపారు.
Rahul Gandhi: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆప్‌తో పొత్తుపై కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో ఆప్‌తో పొత్తు ఉండకూడదని కోరుకున్నానని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఆప్‌కి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందా అని ప్రశ్నించినప్పుడు..
Arvind Kejriwal: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం రోజు బీజేపీ తన మేనిఫెస్టోని ప్రకటించింది. అయితే, ఈ మేనిఫెస్టోపై ఆప్ విరుచుకుపడుతోంది. ఇప్పుడున్న సంక్షేమ పథకాలతో పాటు మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బీజేపీ తన పథకాలను వెల్లడించింది. సిలిండర్లపై సబ్సిడీతలతో పాటు మహిళలకు, తల్లులకు, సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. 16 మందితో కూడిన లిస్ట్‌ను వెల్లడించింది. ప
End India bloc: ఇండియా కూటమిని ఉద్దేశిస్తూ జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆమ్‌ఆద్మీ పార్టీల మధ్య విభేదాలు తలెత్తడంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను ఆయన ప్రశ్నించారు. కలసికట్టుగా ఉండకపోతే కూటమికి ముగింపు పలకాలన్నారు.
Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది.