ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన నివాసంలో జరిగే ఈ సమావేశంలో దేశ రాజధాని ఢిల్లీలో పెరిగిన నీటి బిల్లుల అంశంపై చర్చించనున్నారు.
ఇండియా కూటమికి మద్దతు ఇవ్వడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం చెప్పారు. భారత కూటమితో తమ పార్టీ విడిపోదని స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీబీఐ అడిగే ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెబుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి.. దాచిపెట్టేందుకు ఏమీ లేదని కేజ్రీవాల్ అన్నారు. తన అరెస్ట్‌కు బీజేపీ ఆదేశాలు ఇచ్చిందని, సీబీఐ వాటిని తప్పక పాటిస్తుందని ఆరోపించారు.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు సంచలనంగా మారింది. ఈ కేసును సీబీఐ, ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు చాలా మంది అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ ఆదేశించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటికే సీబీఐ, ఈడీ అధికారులు పలువురు ప్రముఖులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని విపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయి. 2024 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరు కలిసి కట్టుగా ఉండి మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ అసెంబ్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కంటి వెలుగు, సాగునీటిరంగ అద్భుత ప్రగతిపై ప్రత్యేకంగా ప్రస్తావించారు అరవింద్ కేజ్రీవాల్.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంపై తీవ్ర దాడిని ప్రారంభించారు. ప్రకటనలపై అధిక వ్యయం కారణంగా ఢిల్లీ బడ్జెట్‌కు అంతకుముందు రోజు కేంద్రం ఆమోదం ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం బడ్జెట్ సమర్పణకు ఆమోదం తెలపడానికి ముందు ప్రకటనల ఖర్చుపై వివరణ ఇవ్వాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది.