ఐపీఎల్ 2022 సీజన్ జోష్ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. దీంతో ఈ మ్యాచ్‌కు రికీ పాంటింగ్…
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 115 పరుగులకే ఆలౌటైంది. జితేష్ శర్మ (32), మయాంక్ అగర్వాల్ (24) టాప్ స్కోరర్లు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం…
పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ రెండు జట్లూ ఇవాళ ఢీకొడుతున్నాయి. ఐపీఎల్ 2022లో భాగంగా జరుగుతున్న 32వ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ టాస్ గెలిచాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మిచెల్ మార్ష్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను తీసుకున్నట్లు పంత్ తెలిపాడు. పంజాబ్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. మయాంక్ తిరిగి రావడంతో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ బెంచ్‌కే పరిమితం అయ్యాడు.…
ఐపీఎల్‌లో భాగంగా శనివారం జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లనే విజయం వరించింది. తొలి మ్యాచ్‌లో టార్గెట్ ఛేదించడంలో ముంబై ఇండియన్స్ చతికిలపడగా.. రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బొక్కా బోర్లా పడింది. ఓ దశలో వార్నర్ (66) పోరాటంతో గెలిచేలా కనిపించిన ఢిల్లీ చేతులారా వికెట్లు కోల్పోయి పరాజయాన్ని కొనితెచ్చుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత…
ఐపీఎల్ 2022లో కొత్తగా ప్రవేశించిన లక్నోసూపర్ జెయింట్స్ టీమ్ జోరు కొనసాగుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన లక్నో.. అనంతరం బ్యాటింగ్‌లో డికాక్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో గెలుపు అందుకుంది. డికాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో…
ఐపీఎల్‌లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరు చేసింది. ఆరంభంలో అదరగొట్టిన ఆ జట్టు బ్యాటర్లు ఆ తర్వాత నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఢిల్లీ జట్టు సాధించిన స్కోరులో ఓపెనర్ పృథ్వీ షా ఒక్కడే 61 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ 39 నాటౌట్, సర్ఫరాజ్ ఖాన్ 36…
ఐపీఎల్‌లో వరుస పరాజయాలతో డీలా పడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గుడ్‌న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ బౌలర్, ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ జట్టుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దీపక్ చాహర్ నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. ఆదివారం పంజాబ్‌తో జరిగే మూడో మ్యాచ్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేలంలో ఏకంగా రూ.14 కోట్లు పెట్టి చాహర్‌ను చెన్నై జట్టు తిరిగి దక్కించుకుంది. దీంతో అతడి సేవలు రవీంద్ర జడేజా నేతృత్వంలోని టీమ్‌కు…
ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురై నిరాశలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ తాజాగా జట్టులో చేరాడు. వీసా నిబంధనల్లో సాంకేతిక సమస్యల కారణంగా తొలి మ్యాచ్‌కు దూరమైన మొయిన్ అలీ రెండో మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు. 2021లో చెన్నై టైటిల్ గెలవడంలో మొయిన్ అలీ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ ఏడాది చెన్నై యాజమాన్యం రుతురాజ్ గైక్వాడ్, ధోనీ, జడేజాలతో పాటు…
ఐపీఎల్ 15వ సీజన్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ విజయంతో ప్రారంభించింది. పటిష్ట ముంబై ఇండియన్స్ జట్టును 4 వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని 18.2 ఓవర్లలోనే ఉఫ్ మని ఊదేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా లలిత్ యాదవ్ (48 నాటౌట్), అక్షర్ పటేల్ (38 నాటౌట్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి ఢిల్లీ జట్టును గెలిపించారు. దీంతో ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ బూడిద పాలైపోయింది. పృథ్వీ షా (38),…
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి దిగింది. నిబంధనల ప్రకారం ప్రతి టీమ్ నలుగురు విదేశీ ఆటగాళ్లను తుది జట్టులో ఆడించే అవకాశం ఉంటుంది. కానీ రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మాత్రం న్యూజిలాండ్ ఆటగాడు టిమ్ సీఫెర్ట్, వెస్టిండీస్ ఆటగాడు ఆర్.పావెల్‌కు మాత్రమే జట్టులో అవకాశం కల్పించింది. గతంలో 2011లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా కేవలం ఇద్దరు విదేశీ ఆటగాళ్లతోనే బరిలోకి…