IPL 2022 : ఢిల్లీపై రాజస్తాన్ ఘన విజయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ రోజు ఐపీఎల్ సీజన్ 2022లో జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడ్డాయి. ఈ రోజు మంబాయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును ఢిల్లీ జట్టు ముందుంచింది. అయితే రాజస్తాన్ ఓపెనర్లు జోష్ బట్లర్, పడిక్కల్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 155 పరుగులు చేసింది. 155 పరుగుల వద్ద రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన పడిక్కల్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఢిల్లీ బౌలర్లలో ఖాలీల్ ఆహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీతో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో అతడికి మూడో సెంచరీ కావడం విశేషం.
అనంతరం 223 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ రూపంలో మొదటి వికెట్‌ను కోల్పోయింది. 48 పరుగుల వద్ద ఢిల్లీ రెండో వికెట్, 99 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ మూడో వికెట్, 124 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్, 16 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. అఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 15 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. ఒబెడ్ మెక్‌కాయ్ వేసిన అఖరి ఓవర్లో 36 పరుగులు అవసరమవ్వగా.. పావెల్ తొలి మూడు బంతులకు మూడు సిక్సర్‌లు బాది ఢిల్లీ విజయంపై ఆశలు రేపాడు. అయితే చివరి మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 207 పరుగులు మాత్రమే చేసింది. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానానికి ఎగబాకింది.
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
తాజావార్తలు
-
Saudi-Houthi: మరింత దూకుడు పెంచిన హౌతీలు.. రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి!
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!