ఐపీఎల్ 2022 సీజన్ జోష్ మామూలుగా లేదు. నువ్వా నేనా అన్నట్లుగా జట్ల మధ్య పోటీ నడుస్తోంది. అయితే తాజాగా ఈ రోజు 7.30 గంటలకు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరును ఢిల్లీ జట్టు ముందుంచింది. అయితే రాజస్తాన్ ఓపెనర్లు జోష్ బట్లర్, పడిక్కల్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు.
15 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 155 పరుగులు చేసింది. ఆ తరువాత 155 పరుగుల వద్దనే రాజస్తాన్ రాయల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన పడిక్కల్.. ఖాలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు. ఢిల్లీ బౌలర్లలో ఖాలీల్ ఆహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ ఓపెనర్ జోస్ బట్లర్ సెంచరీతో మెరిశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు ఉన్నాయి. కాగా ఈ సీజన్‌లో అతడికి మూడో సెంచరీ కావడం విశేషం.