గత సంవత్సరం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) చాలా కొత్తగా కనిపించింది. కొత్త జయమాన్యం, కొత్త కోచింగ్ సిబ్బంది మాత్రమే కాకుండా.. కొత్త కెప్టెన్‌గా అక్షర్ పటేల్ నియమితుడయ్యాడు. లీగ్ మొదటి అర్ధభాగంలో డీసీ బాగా ఆడింది. వరుసగా నాలుగు మ్యాచ్‌లను గెలిచి.. ఐదవ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చేతిలో తృటిలో ఓడింది. ఆరవ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన ఢిల్లీ.. ఆపై పూర్తిగా గాడి తప్పింది. తదుపరి ఎనిమిది మ్యాచ్‌లలో రెండింటిని మాత్రమే గెలిచారు. అందులో ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఒక పాయింట్, నెట్ రన్ రేట్ కారణంగా టాప్-4 స్థానాన్ని కోల్పోయింది.
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నిలకడ లేకపోవడం. ఢిల్లీకి ఇదే అతిపెద్ద బలహీనత. రికీ పాంటింగ్ శిక్షణలో అద్భుతంగా రాణించిన డీసీ టైటిల్ పోటీ దారుగా కనిపించింది కానీ.. ఆ తర్వాత గాడి తప్పింది. ఈ ఏడాది అయినా సెమీస్ చేరాలంటే.. కొన్ని మార్పులు తప్పనిసరి అని ఐపీఎల్ 2025 ద్వారా స్పష్టమైంది. పేలవమైన ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్లను విడుదల చేసి.. ఆ ఖాళీ పర్సును ఉపయోగించి ప్రభావవంతమైన ప్లేయర్స్‌ను జట్టులో చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్ 2026 మినీ వేలానికి టీమ్స్ అన్ని సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో రిలీజ్ చేసే ఆటగాళ్ల లిస్ట్‌ను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఐదుగురు స్టార్ ప్లేయర్స్ ఢిల్లీ నుంచి రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో డేంజర్ బ్యాటర్స్, పేసర్ ఉన్నారు.
మిచెల్ స్టార్క్:
ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2024 ఐపీఎల్ వేలంలో అధిక ధరను పొందాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్క్‌ను రూ.24.75 కోట్లకు కొనుగోలు చేసింది. కోల్‌కతా న్యాయం చేయకపోవడంతో అతడిని రిలీజ్ చేసింది. 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.11.75 కోట్లకు దక్కించుకుంది. గతేడాది పర్వాలేదన్పించాడు. అయితే స్టార్క్ ఇప్పటికే టీ20 అంతర్జాతీయ ఫార్మాట్ నుండి రిటైర్ అయ్యాడు. చివరి నిమిషంలో స్టార్క్ ఐపీఎల్ నుంచి కూడా వైదొలిగే ప్రమాదం లేకపోలేదు.
Also Read: Team India Schedule 2025: ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన.. టీమిండియా తదుపరి షెడ్యూల్ ఇదే!
టి నటరాజన్:
తమిళనాడు ఫాస్ట్ బౌలర్ టి నటరాజన్ కోసం ఢిల్లీ రూ.10.75 కోట్లు ఖర్చు చేసింది. అయితే అతడు కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. పేలవ ప్రదేశంగా కారణంగా నటరాజన్ జట్టులో చోటు సంపాదించలేకపోయాడు. ఇటీవల పలు గాయాలతో ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో నటరాజన్‌ను రిలీజ్ చేసేందుకు ఢిల్లీ సిద్ధమైందట.
జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్:
జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ పవర్‌ప్లేలో చెలరేగుతాడు. ఫామ్‌లో ఉన్నప్పుడు అతడ్ని ఆపడం కష్టమే. గతేడాది ఐదు ఇన్నింగ్స్‌లలో 55 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత ప్లేయింగ్ 11లోకి రాలేదు. ఇప్పుడు అతడి ఫామ్ అంత బాగా లేదు. ఈ నేపథ్యంలో మెక్‌గుర్క్‌ను విడుదల చేసి.. రూ.9 కోట్లతో మంచి ఆటగాడిని తీసుకోవాలని చూస్తోంది.
ముఖేష్ కుమార్:
భారత పేసర్ ముఖేష్ కుమార్‌ను గతేడాది వేలంలో రూ.8 కోట్లకు డీసీ కొనుగోలు చేసింది. ముఖేష్ 12 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి 10.32 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. డెత్ ఓవర్లలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 2026 వేలానికి ముందు ముఖేష్‌ను రిలీజ్ చేసి.. మరో స్టార్ బౌలర్‌ను తీసుకోవాలని ఢిల్లీ చూస్తోంది.
ఫాఫ్ డుప్లెసిస్:
ఐపీఎల్ 2025 వేలంలో ఫాఫ్ డుప్లెసిస్‌ను ఢిల్లీ రూ.2 కోట్లకు దక్కించుకుంది. అంతముకుముందు చెన్నైకి ఆడిన డుప్లెసిస్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది డీసీ. అయితే అతడు పూర్తిగా నిరాశపరిచాడు. 9 మ్యాచ్‌లు ఆడి 22.44 సగటు, 123.92 స్ట్రైక్ రేట్‌తో 202 రన్స్ మాత్రమే చేశాడు. ఇప్పుడు అతడు ఫామ్‌లో కూడా లేడు. దాంతో మినీ వేలానికి ముందు రిలీజ్ డుప్లెసిస్‌ను రిలీజ్ చేయాలని ఢిల్లీ ప్లాన్ చేస్తోందట.