DGCA: పొగమంచు, వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా విమానయాన కార్యకలాపాలపై దెబ్బ పడింది. ముఖ్యంగా ఢిల్లీలో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్టు, విమానాల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆలస్యం వల్ల పలువురు ప్రయాణికులు అసహనంతో ఎయిర్ లైనర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. విమానాల ఆలస్యం, రద్దుకు సంబంధించి వరస ఫిర్యాదుల నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) సోమవారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPలు) జారీ చేసింది.
Flight delay: పొగమంచు కారణంగా ఢిల్లీ, ముంబై ప్రాంతాల్లో విమానాల కార్యకలాపాలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. గంటల కొద్దీ ప్రయాణికులు విమానాల్లోనే చిక్కుకుపోయారు. ప్రయాణికుల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఇండిగో విమానంలో ఫ్లైట్ డిలే అవుతుందని ప్రకటించిన కెప్టెన్‌పై ప్రయాణికుడు అసహనంతో దాడి చేశాడు. ఈ ఘటనపై కేంద్రం విమానయాన శాఖ మంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దాదాపుగా 100 విమానాలు ఆలస్యమయ్యాయి. చాలా మంది ప్రయాణికులు…
దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్ రావడంతో కలకలం రేగింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్, లక్నో, చండీఘడ్, జైపూర్ ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈమెయిల్ రావడంతో ఆయా రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. బాంబ్ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. అధికారిక కస్టమర్ కేర్ ఐడీకి ఇమెయిల్ రావడంతో అన్ని విమానాశ్రయంలో కలకలం రేగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. స్థానిక పోలీసుల సహాయంతో విమానాశ్రయంతో పాటు అక్కడ ల్యాండింగ్ చేసే…
Delhi Airport: దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు దట్టంగా కమ్మేసింది. దీంతో ఢిల్లీ వ్యాప్తంగా పలు చోట్ల విజిబిలిటీ మందగించింది. పొగమంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాశ్రయంలో రన్‌వే విజువల్ రేంజ్(ఆర్‌వీఆర్)ని పొగమంచు ప్రభావితం చేస్తుందని ఐఎండీ తెలిపింది. దీంతో విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం ఉదయం 9.45 గంటల వరకు రన్ వే విజిబిటిలీ 500 మీటర్ల కంటే ఎక్కువగా ఉంది.
Delhi Airport: మ్యూనిచ్ నుంచి వస్తున్న లుఫ్తాన్సా విమానంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రస్థాయికి చేరడంతో తోపులాట జరిగింది.
G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీలో భారత్ అధ్యక్షతన జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనుంది. ఈ సమయంలో వివిధ ప్రభుత్వ సంస్థలు అనేక రకాల ఆంక్షలు ప్రకటించాయి.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో తృటిలో పెనుప్రమాదం తప్పింది. రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్‌కు అనుమతి ఇచ్చారు. చివరి క్షణాలను టేకాఫ్‌ను రద్దు చేయాలని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) ఇచ్చిన ఆదేశాలతో టేకాఫ్‌ను నిలిపివేశారు.
G20 Summit: వచ్చే నెలలో జరగనున్న జీ-20 సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబవుతోంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు వస్తున్నందున ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల సన్నాహాలు జరుగుతున్నాయి.
కస్టమ్స్ అధికారులమని చెప్పి సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇద్దరు ఆగంతకులు బురిడీ కొట్టించారు. అతని వద్ద నుంచి 4.15 లక్షల రూపాయలను దోచుకున్నారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
విమానంలో మూత్ర విసర్జన చేసిన మరో ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. మూత్ర విసర్జన చేశాడు. అనంతరం అక్కడే ఉమ్మివేశాడు. ప్రయాణికుడి దుష్ప్రవర్తనను గమనించిన క్యాబిన్ సిబ్బంది.. అతడిని హెచ్చరించారు.