బాలీవుడ్ లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. స్టార్స్ ఒకరి తరువాత ఒకరు తమను ప్రేమించిన వారిని వివాహమాడుతున్నారు. ఇక త్వరలో బాలీవడ్ రొమాంటిక్ హీరో రణబీర్ కపూర్- ఆలియా భట్ ల వివాహం కూడా అంగరంగ వైభవంగా జరగనున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటికానున్నారు. ఇక వీరిద్దరు జంటగా చిక్కితే మీడియాకు పండగే.. ఇటీవల వీరిద్దరు కలసి దీపావళి వేడుకను ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే.…
ఎంతో ఆనందంగా టపాసులు కాల్చి సంబరాలు చేసుకొనే దీపావళి పండుగ రోజు అపశృతి చోటు చేసుకుంది. మెహదీపట్నంలో దీపావళి వేడుకలు మొదలై టపాసులు కాలుస్తుండగా ప్రమాదవశాత్తు పలువురి కంటికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి తరలించారు. దీపావళి సందర్బంగా టపాసులు కాలుస్తుండగా ఏడుగురు గాయాలయ్యాయని.. వారిలో ఐదుగురికి ప్రథమ చికిత్స చేసి అనంతరం ఇంటికి పంపించినట్లు సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ఆర్ఎంవో నాజాఫి బేగం తెలిపారు. మరో ఇద్దరిని మాత్రం…