2021లో దాదాపు 270 తెలుగు సినిమాలు విడుదలైతే అందులో స్ట్రయిట్ మూవీస్ సుమారు 200. థియేటర్లలో కాకుండా ఇందులో ఇరవైకు పైగా సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యాయి. విశేషం ఏమంటే యంగ్ హీరోస్ తో పాటు స్టార్ హీరోలనూ డైరెక్ట్ చేసే ఛాన్స్ కొత్త దర్శకులకు ఈ యేడాది లభించింది. మరి ఈ నయా దర్శకులలో ఎవరెవరు తమ సత్తా చాటారో తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున నటించిన ఒకే ఒక్క చిత్రం ‘వైల్డ్ డాగ్’…